ss

ss
my

10, మే 2020, ఆదివారం

అజామిళుడు

అజామిళుడు

         @@@  

  ఇది భాగవతం లో ఒక పాత్ర.  పేరు అజామిళుడు.  ఇతను సద్బ్రాహ్మణ కుటుంబం లో జన్మించి వేదవేదాంగాలను క్షుణ్ణంగా అభ్యసించాడు.  ఒకరోజు తండ్రి ఆనతి మేరకు పూజకు కావలసిన పూలు కోయడానికి తోటకు వెళ్ళాడు.  పూవులు కొస్తుండగా ఇద్దరు యువతీయువకులు కౌగలించుకుని ముద్దులాడుకోవడం చూసాడు.  ఇతని మనసు గతి తప్పింది.  విరహం తో వేగిపోయాడు.  వచ్చినపని మరచిపోయి ఒక వేశ్యాగృహానికి వెళ్ళాడు.  ఒక వేశ్యా సంపర్కంతో పూర్తిగా కామాంధుడై ఇల్లూవాకిలి విస్మరించి ఆమె పొందు లోనే ఇరవైనాలుగు గంటలు గడపసాగారు.  

  వారికి కొందరు పిల్లలు పుట్టారు.  వార్ధక్య ప్రభావంతో అనేక వ్యాధుల బారిన పడి మృత్యువు కు చేరువ అయ్యాడు.  అతనిని తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. అదే సమయం లో అజామిళుడు తన పెద్ద కొడుకు నారాయణుని "నారాయణా.. నారాయణా.." అని పిలిచాడు.  వెంటనే అక్కడికి విష్ణుదూతలు వచ్చారు.  

  అతను ధర్మం వీడి వేశ్యాలోలుడై మహా పాపాలు చేసాడు కాబట్టి అతడిని నరకానికి తీసుకెళ్తాం అని యమదూతలు --- ఎన్ని పాపాలు చేసినా నారాయణ నామం జపించాడు కాబట్టి స్వర్గానికి తీసుకెళ్లాల్సిందే అని విష్ణుదూతలు వాదులాడుకున్నారు. అజామిళుడు వేదరహస్యాలు ఎరిగిన వాడు కాబట్టి అతడికళ్ళకు వీరి వాగ్వాదం కనిపించింది.   భయం తో మరింతగా నారాయణ నామం జపించాడు.  

  ఎంతసేపటికీ మరణం రాకపోవడం తో విష్ణు దూతలు, యమదూతలు వెళ్లిపోయారు.  అప్పటినుంచి అతడు పాపకార్యాలు వదిలేసి నారాయణ మంత్రం జపిస్తూ మరికొంతకాలం జీవించి నేరుగా స్వర్గలోకం వెళ్ళిపోయాడు. 

    ***  

నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?  

 మొదటిది -  యుక్తవయసు వచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలను తల్లితండ్రులు జాగ్రత్తగా గమనిస్తుండాలి.  వారు కాలేజీలకు వెళ్తున్నారా లేక తమ ఆడ/మగ స్నేహితులతో సినిమాలకు, షికార్లకు వెళ్తున్నారా?  స్మార్ట్ ఫోన్స్ లో పెద్దలు లేనపుడు వారు ఏమి చూస్తున్నారు?  ఇలాంటి విషయాలను పెద్దలు చూస్తుండాలి.  పిల్లలమీద గుడ్డినమ్మకాలు పెట్టుకోకూడదు.  

 రెండోది -  ఒక మనిషి ఎన్ని తప్పులు అయినా చెయ్యవచ్చు... కానీ పశ్చాత్త్తాపం చెందటం,  చేసిన తప్పులు గ్రహించడం, మరోసారి అలాంటి తప్పులు చెయ్యకుండా ఉండటం  మనిషి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని పెంచుతుంది.

  అజామిళుడి కథ మనకు చెప్పేది అదే.

కామెంట్‌లు లేవు: