ss

ss
my

11, మే 2020, సోమవారం

పరీక్షిత్తు

పరీక్షిత్తు 

@@@

  అభిమన్యుడు ఉత్తర లకు జన్మించిన వాడు.  యితడు గర్భం లో ఉండగా అశ్వద్ధామ బ్రహ్మ శిరోనామకాస్త్రము అనే ఆయుధం తో కొట్టాడు. ఆ బాధను ఓర్చుకోలేక ఉత్తర శ్రీకృష్ణుడిని ప్రార్ధించింది.  శ్రీకృష్ణుడు వచ్చి ఆమె బాధను నివారణ చేసాడు.  యితడు గర్భం లో ఉన్నపుడే లోకాన్ని పాలించే పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడా అని పరీక్షించాడట... ఆ కారణంగా ఇతను పరీక్షిత్తు నామధేయుడు అయ్యాడు. 

  పరీక్షిత్తు అరవై సంవత్సరాలు పరిపాలించాడు.  ఒకనాడు వేటకై అడవికి వెళ్లి ఒక జింక ను చూసి తరుముతూ వెళ్తుండగా ఆ జింక శమీకుడు అనే ముని ఆశ్రమం లో దూరింది.  తపస్సు లో ఉన్న శమీకుని చూసి "ఇటు వచ్చిన జింక ఏమైంది?" అని అడిగాడు పరీక్షిత్తు. శమీకుడు బదులు ఇవ్వలేదు.  పరీక్షిత్తు కు కోపం వచ్చి అక్కడ చచ్చిన పాము ఒకటి కనిపిస్తే దాన్ని తీసి శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు.   కొంచెం సేపు తరువాత శమీకుని కుమారుడు శృంగి అనేవాడు ఆశ్రమానికి వచ్చి తండ్రి మెడలోని సర్పాన్ని చూసి ఆగ్రహావేశుడై "నా తండ్రి మెడలో సర్పాన్ని వేసిన వాడు ఏడు రోజుల్లోగా  సర్పం కాటుకు బలి అవుతాడు"  అని శపించాడు.  

  ఆ తరువాత శమీకుడు మేలుకొని జరిగిన విషయం గ్రహించి "రాజును శపించడం తప్పు.  బ్రాహ్మణ శాపం తప్పించడం తరం కాదు.. కనుక ప్రాయశ్చిత్తం చేసుకోమని పరీక్షిత్తు కు చెప్పు"  అని తన శిష్యుడిని పరీక్షిత్తు దగ్గరకి పంపించాడు.  ఆ శాపం వివరాలు తెలియగానే పరీక్షిత్తు భయకంపితుడై ఏ రకమైన పురుగు పుట్రా చొరబడటానికి వీలులేని విధంగా ఒక కోటను నిర్మించుకుని భయంభయంగా కాలం గడుపుతున్నాడు.  

  ఒకరోజు కొందరు బ్రాహ్మణులు పరీక్షిత్తును ఆశీర్వదించడానికి కోటకు మంత్రించిన నిమ్మకాయలు ఇచ్చారు.  పరీక్షిత్తు ఆ నిమ్మకాయను తీసుకుని వాసన చూసాడు.  ఆ నిమ్మకాయలో సూక్ష్మ రూపం లో దాక్కున్న సర్పం ఒకటి బయటకి వచ్చి పరీక్షిత్తును కాటువేసింది.  పరీక్షిత్తు తక్షణమే మరణించాడు.  

భారతం, భాగవతమ్ కావ్యాలలో చెప్పబడిన కథ ఇది. 

                 @@@  

నిజానికి ఈ కథలో నీతుల కంటే దిగ్భ్రమగొలిపే వింతలు ఎక్కువ.  

గర్భస్థ శిశువుకు కూడా గుండె, కిడ్నీ ఆపరేషన్స్ జరుగుతున్న వార్తలను ఈరోజుల్లో వింటున్నాము.  మన పురాణకాలం లో కూడా గర్భస్థ శిశువులకు అనారోగ్యాలు సంభవించినపుడు శ్రీకృష్ణుడు లాంటి వైద్యులు సర్జరీలు చేసి కాపాడేవారు అని అర్ధం చేసుకోవాలి.  

 ఇక తనకోపమే తనశత్రువు అని శతకకారుడు చెప్పినట్లు అకారణ  కోపం, అహంకార పూరిత ఆగ్రహం  అనేది మనిషి పతనానికి దారితీస్తుంది.  పెద్దలు అనే గౌరవం లేకుండా పరీక్షిత్తు ముందూ వెనకా చూడకుండా శమీకుని దేహంపై చచ్చిన పామును విసిరాడు.  పెద్దలను గౌరవించాలి, ఒకపని చేసేముందు దాని ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోవాలి.  చేతిలో అధికారం ఉన్నది కదా అని అహంకరిస్తే అది అతని పతనానికి బాటలు వేస్తుంది.  

  పాములు పగబడతాయా లేదా అనేది ఎప్పటినుంచో చర్చనీయాంశం గా ఉన్నది.  పామరులు నమ్ముతారు.  శాస్త్రం అంగీకరించదు.  ఏ పాములను చంపినా, తాచు, నాగు పాములను చంపటానికి సాహసించరు.  అవి పగబట్టి ఎప్పటికైనా చంపుతాయి అని నమ్మకం మనలో ఉన్నది.  అలాగే పిల్లలు పుట్టగానే సర్పదోషాలు ఏమైనా ఉన్నాయో అని ముందుగా సిద్ధాంతులను ప్రతిఒక్కరూ సంప్రదిస్తారు.  సర్పదోషాలు ఉన్నాయి అంటే వాటికి శాంతులను చేయిస్తారు.  సుబ్రహ్మణ్య స్వామీ దేవాలయాలకు వెళ్లి పూజలు చేయిస్తారు.  ఎవరి అనుభవం ద్వారా వాళ్ళు తెలుసుకోవాల్సిందే తప్ప నేను చెప్పేదే నిజం అని వక్కాణించలేము.  

  చివరిగా చెప్పే మాట ఏమిటంటే... నా అనుభవంలో మాత్రం....సర్పదోషాలు ఉండటం...నూటికి లక్ష పాళ్ళు నిజం, నిజం, నిజం....

కామెంట్‌లు లేవు: