ss

ss
my

20, ఆగస్టు 2021, శుక్రవారం

జంధ్యాల పౌర్ణమి

ఎల్లుండి ( ఆదివారం 22-08-2021)
జంధ్యాల పౌర్ణమి.  శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది.  ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను.  
.
ప్రార్థన:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
.
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః ||
.
అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా |
యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||
పుండరీకాక్ష!  పుండరీకాక్ష!  పుండరీకాక్ష!
(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)
.
ఆచమన విధానం: 

ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా, 
3. ఓం మాధవాయ స్వాహా, 
అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను.  తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.
4. ఓం గోవిందాయనమః, 
5. ఓం విష్ణవే నమః, 
6. ఓం మధుసూదనాయనమః, 
7. ఓం త్రివిక్రమాయనమః, 
8. ఓం వామనాయనమః, 
9. ఓం శ్రీధరాయనమః, 
10. ఓం హృషీకేశాయనమః, 
11. ఓం పద్మనాభాయనమః, 
12. ఓం దామోదరాయనమః, 
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః, 
15. ఓం ప్రద్యుమ్నాయనమః, 
16. ఓం అనిరుద్ధాయనమః, 
17. ఓం పురుషోత్తమాయనమః, 
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః, 
21. ఓం జనార్దనాయనమః, 
22. ఓం ఉపేంద్రాయనమః, 
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను.  అటు పిమ్మట:
.
భూతోచ్చాటన:
(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |  దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః
.
(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)
.
గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.
ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ |  ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||
.
తదుపరి సంకల్పం:
మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే 
.
(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య" అని చెప్పనక్కర లేదు)
.
యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను.
.
యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా, 
దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||
.
"ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం 
యజ్ఞోపవీతం బలమస్తు తేజః "
అని చెప్పి అని ధరించవలెను.
.
(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)
.
ద్వితీయోపవీత ధారణం:
తిరిగి ఆచమనం చేసి 
ఆచమన విధానం: 

ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా, 
3. ఓం మాధవాయ స్వాహా, 
అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను.  తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.
4. ఓం గోవిందాయనమః, 
5. ఓం విష్ణవే నమః, 
6. ఓం మధుసూదనాయనమః, 
7. ఓం త్రివిక్రమాయనమః, 
8. ఓం వామనాయనమః, 
9. ఓం శ్రీధరాయనమః, 
10. ఓం హృషీకేశాయనమః, 
11. ఓం పద్మనాభాయనమః, 
12. ఓం దామోదరాయనమః, 
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః, 
15. ఓం ప్రద్యుమ్నాయనమః, 
16. ఓం అనిరుద్ధాయనమః, 
17. ఓం పురుషోత్తమాయనమః, 
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః, 
21. ఓం జనార్దనాయనమః, 
22. ఓం ఉపేంద్రాయనమః, 
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను.
“మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.
.
తృతీయ యజ్ఞోపవీత ధారణం:
తిరిగి ఆచమనం చేసి 
ఆచమన విధానం: 

ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా, 
3. ఓం మాధవాయ స్వాహా, 
అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను.  తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.
4. ఓం గోవిందాయనమః, 
5. ఓం విష్ణవే నమః, 
6. ఓం మధుసూదనాయనమః, 
7. ఓం త్రివిక్రమాయనమః, 
8. ఓం వామనాయనమః, 
9. ఓం శ్రీధరాయనమః, 
10. ఓం హృషీకేశాయనమః, 
11. ఓం పద్మనాభాయనమః, 
12. ఓం దామోదరాయనమః, 
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః, 
15. ఓం ప్రద్యుమ్నాయనమః, 
16. ఓం అనిరుద్ధాయనమః, 
17. ఓం పురుషోత్తమాయనమః, 
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః, 
21. ఓం జనార్దనాయనమః, 
22. ఓం ఉపేంద్రాయనమః, 
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను.
“ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.
.
చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట:  
తిరిగి ఆచమనం చేసి
ఆచమన విధానం: 

ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా, 
3. ఓం మాధవాయ స్వాహా, 
అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను.  తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.
4. ఓం గోవిందాయనమః, 
5. ఓం విష్ణవే నమః, 
6. ఓం మధుసూదనాయనమః, 
7. ఓం త్రివిక్రమాయనమః, 
8. ఓం వామనాయనమః, 
9. ఓం శ్రీధరాయనమః, 
10. ఓం హృషీకేశాయనమః, 
11. ఓం పద్మనాభాయనమః, 
12. ఓం దామోదరాయనమః, 
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః, 
15. ఓం ప్రద్యుమ్నాయనమః, 
16. ఓం అనిరుద్ధాయనమః, 
17. ఓం పురుషోత్తమాయనమః, 
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః, 
21. ఓం జనార్దనాయనమః, 
22. ఓం ఉపేంద్రాయనమః, 
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను.
 పై మంత్రమును పఠిస్తూ "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను.  మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.
.
తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను.  (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)
గాయత్రీ మంత్రము:
“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ "
.
తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.
.
జీర్ణోపవీత విసర్జనం:
తిరిగి ఆచమనం చేసి 
ఆచమన విధానం: 

ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా, 
3. ఓం మాధవాయ స్వాహా, 
అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను.  తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.
4. ఓం గోవిందాయనమః, 
5. ఓం విష్ణవే నమః, 
6. ఓం మధుసూదనాయనమః, 
7. ఓం త్రివిక్రమాయనమః, 
8. ఓం వామనాయనమః, 
9. ఓం శ్రీధరాయనమః, 
10. ఓం హృషీకేశాయనమః, 
11. ఓం పద్మనాభాయనమః, 
12. ఓం దామోదరాయనమః, 
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః, 
15. ఓం ప్రద్యుమ్నాయనమః, 
16. ఓం అనిరుద్ధాయనమః, 
17. ఓం పురుషోత్తమాయనమః, 
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః, 
21. ఓం జనార్దనాయనమః, 
22. ఓం ఉపేంద్రాయనమః, 
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను.
.
శ్లో:   ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం
విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||
.
శ్లో:   పవిత్రదంతా మతి జీర్ణవంతం 
వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం 
ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం
జీర్నోపవీతం విసృజంతు తేజః || 
.
శ్లో:   ఏతా వద్దిన పర్యంతం 
బ్రహ్మత్వం ధారితం మయా 
జీర్ణత్వాత్తే పరిత్యాగో 
గచ్ఛ సూత్ర యథా సుఖం ||
.
విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.
తిరిగి ఆచమనం చేసి 
ఆచమన విధానం: 

ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా, 
3. ఓం మాధవాయ స్వాహా, 
అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను.  తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.
4. ఓం గోవిందాయనమః, 
5. ఓం విష్ణవే నమః, 
6. ఓం మధుసూదనాయనమః, 
7. ఓం త్రివిక్రమాయనమః, 
8. ఓం వామనాయనమః, 
9. ఓం శ్రీధరాయనమః, 
10. ఓం హృషీకేశాయనమః, 
11. ఓం పద్మనాభాయనమః, 
12. ఓం దామోదరాయనమః, 
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః, 
15. ఓం ప్రద్యుమ్నాయనమః, 
16. ఓం అనిరుద్ధాయనమః, 
17. ఓం పురుషోత్తమాయనమః, 
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః, 
21. ఓం జనార్దనాయనమః, 
22. ఓం ఉపేంద్రాయనమః, 
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను.
కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపించి
గాయత్రీ మంత్రము:
“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ "

యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను.  ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.  
.
తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.  
.
నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:
జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను.

20, ఫిబ్రవరి 2021, శనివారం

Ilayaraja

"ఇళయరాజా"
చిత్రగాన కల్ప‌వృ‌క్షా‌నికి ఫల‌పు‌ష్ప‌భ‌రి‌త‌మైన కొమ్మ‌లెన్నో, అందులో ఇళ‌య‌రాజా ఒక చిటా‌రు‌కొమ్మ.‌ ‌‘‌‘నాభి‌హృ‌త్కం‌ఠ‌ ర‌స‌నల ద్వారా ఉద్భ‌వించి ఉరి‌కి‌వచ్చే సప్త‌స్వర సుంద‌రు‌లను భజిం‌చిన నాద‌యో‌గు‌లలో ఇళ‌య‌రాజా ఒకరు’‌’‌ అంటూ వేటూరి సుంద‌ర‌రా‌మ‌మూర్తి ఇళ‌య‌రా‌జాను కీర్తిం‌చారు.‌ ‌‘‌‘సహ‌జ‌మైన సంప్రదాయ వాద్య‌ప‌రి‌క‌రా‌లతో సంగీతం సమ‌కూ‌ర్చితే అందులో మనకు ఆత్మ కని‌పి‌స్తుంది.‌ యంత్రా‌లతో సంగీతం అంటే ఎప్పుడూ యాంత్రి‌కం‌గానే వుంటుంది.‌ యాదృ‌చ్చి‌కంగా వచ్చేదే సంగీతం.‌ దానికో సమయం అంటూ వుండదు.‌ అప్పుడే పుట్టిన పసి‌పా‌పలా ఉండేదే సంగీ‌త‌మంటే.‌ విన‌గానే కొత్తగా వుండాలి.‌.‌.‌ వినే శ్రోతకి కొత్త అను‌భూ‌తిని పంచాలి’‌’‌ అనేది ఇళ‌య‌రాజా నమ్మిన సిద్ధాంతం.‌ మన‌సుకు నచ్చని పని ఇళ‌య‌రాజా ఎప్పుడూ చెయ్య‌లేదు.‌ హింసా‌నే‌ప‌థ్యంతో వుండే ఒక కథను కమ‌ల‌హా‌సన్‌ విని‌పిస్తే రాజా ఆ సిని‌మాకు సంగీతం చెయ్య‌లే‌నని చెప్పాడు.‌ తనను ఒప్పిం‌చ‌లేని కథకు రాజా సంగీతం ఇవ్వ‌లేదు.‌ అటు‌వంటి సంగీత మేస్ట్రో ఇళ‌య‌రా‌జా రాజా గురిం‌చిన కొన్ని విశే‌షాలు తెలు‌సు‌కుందాం.‌.‌.‌

*ఎవరు వీరు?

అది మద్రాసు నగరం రాయ‌పే‌ట‌లోని ముత్తు‌మొ‌దలి వీధి.‌ ఆ వీధి చివర ఒక చిన్న గదిలో అల్లి‌న‌గరం చిన్న‌సామి అనే యువ‌కుడు ఉండే‌వాడు.‌ దగ్గ‌ర‌లోని పెట్రోల్‌ స్టేషన్లో పని‌చేస్తూ సినిమా ప్రయ‌త్నాలు సాగిస్తూ ఉండే‌వాడు.‌ 1968లో ఒక‌రోజు తల‌వని తలం‌పుగా ముగ్గురు అన్న‌ద‌మ్ములు ఆ చిన్న‌సామి గదికి వచ్చారు.‌ మదురై పరి‌సర ప్రాంతాల్లో చిన్న‌సామి నాటక ప్రద‌ర్శ‌నలు ఇస్తు‌న్న‌ప్పుడు ఈ ముగ్గురూ సంగీతం అందిం‌చే‌వారు.‌ ఆ సోద‌రుల్లో పెద్ద‌వా‌డిని ‌‘మద్రాసు వచ్చిన కారణం ఏమిటి?’‌ అని ప్రశ్నిస్తే, ‌‘సిని‌మాల్లో మ్యూజిక్‌ చెయ్యా‌లని వచ్చా’‌మని చెప్పాడు.‌ చిన్న‌సా‌మికి ఆశ్చ‌ర్య‌మే‌సింది.‌ సిని‌మా‌లకు సంగీతం కూర్చ‌డ‌మంటే వాళ్లు అను‌కు‌న్నంత సులువు కాదని అత‌నికి తెలుసు.‌ కానీ ఆ సోద‌రుల పట్టు‌దల నచ్చింది.‌ ఆపై ఆ ముగ్గురూ వివిధ రకాల వాద్య‌ప‌రి‌క‌రా‌లపై సాధన చేస్తూనే చిన్న‌చిన్న నాట‌కా‌లకు వాద్య‌స‌హ‌కారం అందిస్తూ కాలం గడ‌ప‌సా‌గారు.‌ ఉన్న‌రోజు తిని, లేని‌రోజు పస్తు‌లుం‌డడం అల‌వాటు చేసు‌కు‌న్నారు.‌ వీరి అవస్థ గమ‌నిం‌చిన చిన్న‌సామి వారికి ఒక గాయ‌కు‌నికి పరి‌చయం చేశాడు.‌ ఆ గాయ‌కు‌నికి ఒక ఆర్కెస్ట్రా బృందం వుండేది.‌ పెళ్లి‌ళ్లకు, ఇతర శుభ‌కా‌ర్యా‌లకు అతడు పాట‌క‌చే‌రిలు నిర్వ‌హిం‌చే‌వాడు.‌ ఆ గాయ‌కుడు మరె‌వ‌రో‌కాదు.‌ సినీ సంగీత నిధి శ్రీపతి పండి‌తా‌రా‌ధ్యుల బాల‌సు‌బ్రహ్మణ్యం.‌ ఆ చిన్న‌సామి కూడా ఎవరో కాదు ప్రఖ్యాత దర్శ‌క‌ని‌ర్మాత భార‌తీ‌రాజా.‌ ఆ ముగ్గు‌రిలో పెద్ద‌వాడు కూడా మరె‌వరో కాదు ఇసై‌జ్ఞాని ఇళ‌య‌రాజా.‌ ఆ మిగతా ఇద్దరూ రాజా సోద‌రులు గంగై అమ‌రన్, భాస్క‌ర్‌లు.‌ బాలు ఇళ‌య‌రా‌జాను ‌‘సంగీతం వచ్చా?’‌ అని అడి‌గారు.‌ ‌‘నేర్చు‌కో‌లేదు.‌ కానీ హార్మో‌నియం వాయి‌స్తాను’‌ అని బదు‌లి‌చ్చాడు రాజా.‌ బాలు అడి‌గిందే తడవు, రాజా హార్మో‌నియం అందు‌కొని డాక్టర్‌ ఝివాగో చిత్రం‌లోని లారా థీమ్‌ మ్యూజిక్‌ వాయించి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాడు.‌ ఎందు‌కంటే ఆ థీమ్‌ మ్యూజిక్‌ అత్యంత క్లిష్ట‌మై‌నది కనుక.‌ ‌‘సంగీత జ్ఞానం లేకుండా ఎలా వాయిం‌చ‌గ‌లి‌గావు?’‌ అని బాలు ప్రశ్నిస్తే, ‌‘మ్యూజిక్‌ విని వాయిం‌చాను’‌ అని రాజా ఇచ్చిన సమా‌ధానం బాలుకు మతి‌పో‌యేలా చేసింది.‌ రాజా హార్మో‌ని‌స్టుగా, గంగై అమ‌రన్‌ గిటా‌రి‌స్టుగా, భాస్కర్‌ డ్రమ్మ‌ర్‌గా వాళ్లు బాలు ట్రూప్‌లో చేరి‌పో‌యారు.‌ బాలు గాయ‌కు‌నిగా సిని‌మాల్లో స్థిర‌ప‌డిన తర‌వాత ఇళ‌య‌రాజా ‌‘పావ‌లార్‌ బ్రదర్స్‌’‌ పేరుతో కొన్ని వందల కచే‌రీలు చేశాడు.‌ తర‌వాత పాశ్చాత్య సంగీ‌తంలో మెళ‌కు‌వలు నేర్చు‌కో‌వా‌లని ధన్‌రాజ్‌ మాస్టర్‌ వద్ద చేరి, వెస్ట్రన్‌ సంగీ‌తం‌తో‌బాటు నొటే‌షన్లు రాయడం కూడా నేర్చు‌కు‌న్నాడు.‌ ధన్‌రాజ్‌ మాస్టర్‌ రాజా నైపు‌ణ్యాన్ని, గ్రహణ శక్తిని చూసి సంగీత దర్శ‌కుడు జి.‌కె.‌వెంక‌టేష్‌ వద్ద సహా‌య‌కు‌నిగా కుది‌ర్చాడు.‌ అక్కడ 1969 నుంచి 1974 వరకు దాదాపు వంద సిని‌మా‌లకు పైగా రాజా సహా‌య‌కు‌డిగా పని‌చే‌శాడు.‌

*
రాళ్లె‌త్తిన కూలీ
ఇళ‌య‌రాజా అసలు పేరు జ్ఞాన‌దే‌శి‌కన్‌.‌ తమి‌ళ‌నా‌డు‌లోని తెన్ని జిల్లా పణై¬్న‌పు‌రంలో జూన్‌ 2, 1943న జన్మిం‌చాడు.‌ తండ్రి రామ‌స్వామి, తల్లి చిన్న‌త్తా‌య‌మ్మాళ్‌.‌ వారిది తమి‌ళ‌నాడు−‌ కేరళ సరి‌హద్దు గ్రామం కావ‌డంతో రామ‌సామి కేరళ తేయాకు తోటల్లో సూప‌ర్‌వై‌జ‌ర్‌గా పని‌చే‌సే‌వాడు.‌ అత‌నిపై అధి‌కారి ఆంగ్లేయ దొర.‌ అతని ప్రోద్బ‌లంతో రామ‌సామి క్రైస్తవ మతం స్వీక‌రిం‌చాడు.‌ అప్పుడు జ్ఞాన‌దే‌శి‌కన్‌ పేరును డేని‌యల్‌ రాజయ్య (రాజా)గా మార్చాడు.‌ రాజా తన మేన‌మామ ఇంటి‌వద్ద ఉంటూ చదు‌వు‌కో‌సా‌గాడు.‌ కుటుంబ ఆర్థిక పరి‌స్థితి సహ‌క‌రిం‌చక పోవ‌డంతో చదు‌వుకు స్వస్తి చెప్పి కూలీ పని‌చే‌శాడు.‌ మదు‌రైలో వైగై నది మీద ఆన‌కట్ట నిర్మాణం జరి‌గి‌న‌ప్పుడు, ఆ ఆన‌కట్ట కోసం రాళ్లె‌త్తిన కూలీ‌లలో రాజయ్య కూడా ఒకడు.‌ అప్పుడే వ్యవ‌సాయ కూలీలు పాడు‌కొనే ఏల‌పా‌టలు, కార్మి‌కులు పాడు‌కొనే జాన‌పద గీతాలు రాజ‌య్యకు కంఠో‌పా‌ఠ‌మ‌య్యాయి.‌ రాజా పాడడం గమ‌నిం‌చిన ఒక ఇంజ‌నీర్‌ అతన్ని తన వద్ద నౌక‌రుగా నియ‌మిం‌చు‌కొని వారా‌నికి 7 రూపా‌యల జీతం ఇచ్చే‌వాడు.‌ ఈ రోజు కోట్లకు పడ‌గె‌త్తినా తన మొదటి సంపా‌దన ఇచ్చిన ఆనందం మర‌చి‌పో‌లే‌ని‌దని అంటుం‌టారు ఇళ‌య‌రాజా.‌ తర‌వాత కమ్యూ‌నిస్టు పార్టీ ప్రచార కార్య‌క్రమాల్లో ప్రజ‌లను ఉత్తే‌జ‌ప‌ర‌చేలా రాజా పాటలు పాడే‌వాడు.‌

*ఇళ‌య‌రా‌జాగా మారిన డేని‌యల్‌ రాజా

జి.‌కె.‌ వెంక‌టేష్‌ బృందంలో రాజా‌తో‌బాటు ప్రఖ్యాత వయో‌లిన్‌ వాద్య‌కా‌రుడు ఎల్‌.‌వైద్య‌నా‌ధన్‌ కూడా సహా‌య‌కు‌డిగా పని‌చే‌స్తుం‌డే‌వాడు.‌ 1974లో జి.‌కె.‌ వెంక‌టేష్‌ సంగీత విభా‌వరి మైసూ‌రులో జరి‌గింది.‌ అప్పుడు రాజా జ్వరాన పడ్డాడు.‌ వైద్య‌నా‌ధన్‌ రాజాను మెల్లిగా కొల్లూ‌రు‌లోని మూకాం‌బిక ఆల‌యా‌నికి తీసు‌కె‌ళ్లాడు.‌ సౌప‌ర్నికా నదిలో స్నానం‌చేసి మూకాం‌బికా మాతను దర్శనం చేకో‌గానే రాజా జ్వరం క్షణంలో మాయ‌మైంది.‌ సర‌స్వతి మంట‌పంలో కూర్చొని వైద్య‌నా‌ధన్‌ వయో‌లిన్‌ వాయి‌స్తుం‌డగా, రాజా రెండు కీర్త‌నలు ఆల‌పిం‌చాడు.‌ అప్పుడు ఆలయ పూజారి గణ‌ప‌తి‌భట్‌ రాజా పేరును ‌‘ఇళ‌య‌రాజా’‌ (యువ‌రాజు అని అర్ధం)గా మార్చాడు.‌ మూకాం‌బికా మాత దర్శనం తర‌వాత ఇళ‌య‌రాజా ఆహా‌ర్యంలో మార్పు వచ్చింది.‌ జుబ్బా, అడ్డ‌పం‌చకు ఆయన పరి‌మి‌త‌మ‌య్యాడు.‌

*సంగీత దర్శ‌కు‌నిగా రాజా తొలి అడు‌గులు

ఇళ‌య‌రా‌జాకు ‌‘దీపం’‌ అనే తమిళ చిత్రా‌నికి సంగీత దర్శ‌కత్వం నిర్వ‌హించే అవ‌కాశం వచ్చినా దాని నిర్మాణం ఆగి‌పో‌యింది.‌ జెమినీ సంస్థ చిత్రా‌నికి సంగీతం అందించే అవ‌కాశం అంది‌నట్లే అంది దక్క‌కుండా పోయింది.‌ 1976లో పంజు అరు‌ణా‌చలం అనే నిర్మాత గ్రామీణ నేప‌థ్యంలో ‌‘అణ్ణ‌క్కిళి’‌ సినిమా నిర్మిస్తూ ఇళ‌య‌రా‌జాకు తొలి అవ‌కాశం ఇచ్చాడు.‌ శివ‌కు‌మార్, సుజాత నటిం‌చిన ఆ సిని‌మాకు ఇళ‌య‌రాజా అందిం‌చిన సంగీతం వినూ‌త్నంగా, విభి‌న్నం‌గానూ వుండ‌డంతో సంగీ‌తా‌భి‌మా‌ను‌లను సంభ్రమా‌శ్చ‌ర్యా‌లకు గురి‌చే‌సింది.‌ అందులో ఎస్‌.‌జా‌నకి ఆల‌పిం‌చిన ‌‘మచ్చానై పార్తిం‌గళా మలై‌వాళ తోప్పు‌క్కుళ్ళే’‌ (తెలు‌గులో ‌‘మావయ్య వస్తా‌డంటా మన‌సిచ్చి పోతా‌డంటా’‌−‌ రామ‌చి‌లక సిని‌మాలో) పాటకు ప్రేక్ష‌కులు లేచి నిల‌బడి డ్యాన్స్‌ చేసే‌వారు.‌ పియానో, గిటార్‌ వంటి పాశ్చాత్య వాద్య పరి‌క‌రా‌ల‌మీద హంస‌ధ్వని, రీతి గౌళ, మోహన వంటి కర్నా‌టక సంప్రదాయ రాగా‌లను మేళ‌వించి స్వర‌ప‌ర‌చ‌డంతో సంగీత ప్రియు‌లకు ఏదో కొత్త‌దనం గోచ‌రించి, క్రమంగా రాజాకు అభి‌మా‌నులై పోయారు.‌ ‌‘నిళ‌ల్గళ్‌’‌ ‌‘ఆరి‌ళి‌రిందు అరు‌వ‌త్తు‌వరై’, ‌‘నేట్రి‌కన్‌’, ‌‘మూదు‌పాణి’, ‌‘నింజతై కిలాత్తే’‌ వంటి సిని‌మా‌ల్లోని పాటలు సూపర్‌ హిట్లుగా నిల‌వ‌డంతో రాజా పేరు తమి‌ళ‌నాట మారు‌మ్రో‌గి‌పో‌యింది.‌ భార‌తీ‌రాజా−‌ఇళ‌య‌రాజా కాంబి‌నే‌షన్లో ఎంతో అద్భు‌త‌మైన పాటలు వచ్చాయి.‌

*తెలుగు తెర‌మీద ఇళ‌య‌రా‌జీయం

ఇళ‌య‌రాజా 1977లో వచ్చిన ‌‘భద్రకాళి’‌ సిని‌మాతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు.‌ అందులో జేసు‌దాస్, సుశీల ఆల‌పిం‌చిన ‌‘చిన్ని‌చిన్ని కన్నయ్యా’‌ పాట తెలుగు ప్రేక్ష‌కు‌లను అల‌రిం‌చింది.‌ తర్వాత వచ్చిన ‌‘వయసు పిలి‌చింది’‌ సిని‌మా‌లోని అన్ని పాటలూ యువ‌త‌రా‌నికి కొత్త సంగీత టాని‌క్‌ను ఎక్కించి మత్తు‌లోకి నెట్టే‌శాయి.‌ హిందీలో విజ‌య‌వం‌త‌మైన ‌‘డాన్‌’‌ సిని‌మాను మేకప్‌ ఆర్టిస్టు పీతాం‌బరం తెలు‌గులో ‌‘యుగం‌ధర్‌’‌ పేరుతో నిర్మిస్తే, ఇళ‌య‌రాజా తన‌దైన శైలిలో సంగీతం అందించి ఆ సిని‌మాను సూపర్‌ హిట్‌ చేశారు.‌ ఎర్రగు‌లా‌బీలు, అజే‌యుడు, పంచ‌భూ‌తాలు, కాళ‌రాత్రి సిని‌మా‌ల‌లోని పాట‌లకు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయి‌పో‌యారు.‌ ఇక 1981లో వచ్చిన సీతా‌కో‌క‌చి‌లక సినిమా పాటలు సంగీత అభి‌మా‌ను‌లను ఇళ‌య‌రాజా మత్తు‌లోకి దించే‌శాయి.‌ ‘వసం‌త‌కో‌కిల’, ‘అమ‌ర‌గీతం’, ‘మధు‌ర‌గీతం’, ‘టిక్‌ టిక్‌ టిక్‌’, ‘పూల‌ప‌ల్లకి’, ‘కొత్త జీవి‌తాలు’ సిని‌మా‌లలో పాటలు మారు‌మ్రో‌గి‌పో‌యాయి.‌ సరి‌కొత్త బాణీలు, వైవి‌ధ్య‌భ‌రిత సంగీతం యువ‌త‌రాన్ని గంగ‌వె‌ర్రు‌లె‌త్తిం‌చింది.‌ ‘శివ’, ‘సాగ‌ర‌సం‌గమం’, ‘అభి‌లాష’, ’రాజ‌కు‌మార్‌’, ‘మంత్రి‌గారి వియ్యం‌కుడు’, ‘సంకీ‌ర్తన’ వంటి సిని‌మా‌ల‌లోని పాటల సంగతి చెప్పా‌ల్సిన పనే‌లేదు.‌ 1984లో దర్శ‌కుడు వంశీతో ఇళ‌య‌రా‌జాకు పరి‌చ‌య‌మైంది.‌ ‌‘సితార’‌ సినిమా అత‌నికి రెండ‌వ‌చిత్రం.‌ రీరి‌కా‌ర్డింగ్‌ కాకుండా డబుల్‌ పాజి‌టివ్‌ వేసి చూపిస్తే శ్రేయో‌భి‌లా‌షులు పెదవి విరి‌చారు.‌ వంశీ నిరాశ చెందాడు.‌ ఇళ‌య‌రాజా దానికి రీ రి‌కా‌ర్డింగ్‌ చేసి విడు‌ద‌ల‌చేస్తే ఆ సినిమా ఎంతటి సంచ‌ల‌నాన్ని సృష్టిం‌చిందో అంద‌రికీ తెలి‌సిన విష‌యమే.‌ ఇక వంశీ సిని‌మాలు ‘లేడీస్‌ టైలర్‌’, ‘అన్వే‌షణ’, ‘ప్రేమించు−‌పెళ్లాడు’, ‘మహర్షి’, ‘చెట్టు‌కింద ప్లీడర్‌’, ‘ఏప్రిల్‌ 1 విడు‌దల’, ‘శ్రీ కనక మహా‌లక్ష్మి డ్యాన్స్‌ ట్రౌపే అన్నీ సంగీ‌త‌ప‌రంగా సూపర్‌ హిట్లే.‌ ‘ఛాలెంజ్‌’, ‘మాంగ‌ల్య‌బంధం’, ‘గీతాం‌జలి’, ‘శ్రీషిర్డీ సాయి‌బాబా మహా‌త్మ్యం’, ‘జ్వాల’, ‘రాక్ష‌సుడు’, ‘ఒక రాధ ఇద్ద‌రు‌కృ‌ష్ణులు’ పెద్ద హిట్‌ సిని‌మాలు.‌ ‘శివ’ సిని‌మాకు ఇళ‌య‌రాజా వినూ‌త్న‌మైన సంగీ‌తాన్ని అందిం‌చారు.‌ సినిమా విజ‌య‌వంతం కాదని తనకు అని‌పిం‌చిన సంద‌ర్భాల్లో, ఇళ‌య‌రాజా నిర్మా‌తల్ని రీరి‌కా‌ర్డింగ్‌ వంటి పను‌లకు ఎక్కు‌వగా ఖర్చు పెట్ట‌ని‌చ్చే‌వారు కాదు.‌ 1988 తర్వాత విడు‌ద‌లైన సిని‌మా‌లలో ఇళ‌య‌రాజా సంగీత పోక‌డలు కొత్త పుంతలు తొక్కాయి.‌ ‘రక్తా‌భి‌షేకం’, ‘జమ‌దగ్ని’, ‘వార‌సు‌డొ‌చ్చాడు’, ‘అభి‌నం‌దన’, ‘రుద్రవీణ’, ‘ఆఖరి పోరాటం’,‘స్వర్ణ‌క‌మలం’, ‘మర‌ణ‌మృ‌దంగం’, ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘ప్రేమ’, ‘విచిత్ర సోద‌రులు’, ‘బొబ్బి‌లి‌రాజా’, ‘కొండ‌వీటి దొంగ’, ‘కూలీ నెంబర్‌ 1’, ‘ఆదిత్య 369’, ‘అంజలి’, ‘ఓ పాపా లాలి’, ‘స్వాతి‌ముత్యం’, ‘తూర్పు సింధూరం’ వాటిలో కొన్ని మాత్రమే.‌ తమి‌ళ‌నా‌డులో సినిమా విడు‌దల రోజున హీరో‌లతో సమా‌నంగా ఇళ‌య‌రాజా కట‌వుట్లు వెలి‌సేవి.‌ మ్యూజిక్‌ షాపులు ఇళ‌య‌రాజా పాటలు కొనే‌వా‌ళ్లతో నిండి‌పో‌యేవి.‌ భార‌తీ‌రాజా తొలి‌చిత్రం ‌‘పదు‌నారు వయ‌ది‌నిలే’‌ (పర‌హా‌రేళ్ళ వయసు)లో ఉత్తమ గాయ‌నిగా ఎస్‌.‌ జాన‌కికి జాతీయ పుర‌స్కారం లభిం‌చింది ఇళ‌య‌రాజా సంగీత దర్శ‌క‌త్వం‌లోనే.‌ అలాగే గాయని చిత్రకు తొలి జాతీయ పుర‌స్కా‌రాన్ని తెచ్చి పెట్టిన ‌‘సింధు‌భై‌రవి’‌ చిత్రా‌నికి సంగీతం సమ‌కూ‌ర్చింది కూడా ఇళ‌య‌రా‌జానే.‌ రాజా పాటల పల్ల‌వులు ఉటం‌కిం‌చా‌లంటే స్థలం చాలని పరి‌స్థితి.‌

మరిన్ని విశే‌షాలు

* 2005లో ఆసియా ఖండం నుంచి అఖండ వాద్య‌బృం‌దంతో లండ‌న్‌లోని రాయల్‌ ఫిల్హా‌ర్మో‌నిక్‌ ఆర్కె‌స్ట్రాతో సింఫనీ నిర్వ‌హిం‌చిన తొలి సంగీత దర్శ‌కు‌డిగా ఇళ‌య‌రాజా పేరు చరి‌త్రపు‌ట‌ల‌కె‌క్కింది.‌ ‌‘తిరు‌ వా‌నగం’‌ పేరుతో నిర్వ‌హిం‌చిన ఈ సింఫనీ ప్రాచీన తమిళ సంప్రదాయ సాహిత్య నేప‌థ్యంగా సాగింది.‌ ఐదు‌సార్లు గ్రామీ పుర‌స్కారం అందు‌కున్న సౌండ్‌ ఇంజ‌నీర్‌ రిచర్డ్‌ కింగ్, ఆస్కార్‌ పురు‌స్కార గ్రహీత స్టీఫెన్‌ షెనా‌ర్ట్‌ రాజా వాద్య‌బృం‌దంలో వుండి సింఫ‌నీకి సహ‌క‌రిం‌చడం, రాజాకు గొప్ప అను‌భూ‌తి‌ని‌చ్చింది.‌

* ‌‘పంచ‌ముఖి’‌ పురుతో కొత్త‌రా‌గాన్ని సృశిం‌చిన ఘనత కూడా ఇళ‌య‌రా‌జాదే.‌

* లండన్‌ నగరం‌లోని ట్రినిటీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ నుంచి బంగారు పతకం సాధిం‌చిన సంగీత స్రష్ట (ఇసై‌జ్ఞాని) ఇళ‌య‌రాజా.‌

* ఇళ‌య‌రాజా సంగీతం అందిం‌చిన సాగ‌ర‌సం‌గమం (తెలుగు), సింధు‌భై‌రవి (తమిళం), రుద్రవీణ (తెలుగు), కేర‌ళ‌వర్మ పళ‌స్సి‌రాజా (మళ‌యాళం) చిత్రా‌లకు జాతీ‌య‌స్థా‌యిలో ఇళ‌య‌రాజా ఉత్తమ సంగీత దర్శ‌కుని బహు‌మ‌తులు అందు‌కు‌న్నారు.‌ సీతా‌కో‌క‌చి‌లక, రుద్రవీణ, జగ‌దే‌క‌వీ‌రుడు −‌ అతి‌లోక సుందరి, శ్రీరా‌మ‌రాజ్యం సిని‌మా‌లకు ఉత్తమ సంగీత దర్శ‌కు‌డిగా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ నంది బహు‌మ‌తులు, ఆరు‌సార్లు తమిళ చిత్ర ఉత్తమ సంగీత దర్శ‌కుని బహు‌మ‌తులు ఇళ‌య‌రా‌జాకు దక్కాయి.‌ మూడు కేరళ ప్రభుత్వ బహు‌మ‌తులు, రెండు ఫిలిం‌ఫేర్‌ బహు‌మ‌తులు కూడా ఇళ‌య‌రాజా పుచ్చు‌కు‌న్నారు.‌ 1988లో తమి‌ళ‌నాడు ప్రభుత్వం ప్రతి‌ష్టా‌త్మక ‌‘కళై‌మా‌మణి’‌ బిరు‌దుతో రాజాను సత్క‌రిం‌చింది.‌ 2010లో రాజాను భారత ప్రభుత్వం పద్మ‌భూ‌షణ్‌ బిరు‌దుతో సత్క‌రిం‌చింది.‌

* ప్రేమించు పెళ్ళాడు చిత్రా‌నికి దరువు లేకుండా కేవలం గిటార్‌ తంత్రిని మీటి పాట రాయ‌మని వేటూ‌రిని కోరారు.‌ సన్ని‌వే‌శా‌నికి అదే మ్యూజిక్‌ బిట్‌ అవు‌తుం‌దని కూడా చెప్పారు.‌ అలా వెలు‌వ‌డిందే ‌‘గోపెమ్మ చేతిలో గోరు‌ముద్ద.‌.‌.‌.‌.‌రాధమ్మ చేతిలో వెన్న‌ముద్ద’‌ పాట.‌

* తన సంగీత గురువు జి.‌కె.‌ వెంక‌టే‌ష్‌కు అవ‌కా‌శాలు తగ్గిన రోజుల్లో తన వద్ద వుంచు‌కుని ప్రతీ‌రోజూ తొలి గౌరవ పారి‌తో‌షి‌కాన్ని అత‌నికి ఇచ్చి గురు‌దక్షిణ చెల్లిం‌చు‌కున్న మహా‌మ‌నిషి ఇళ‌య‌రాజా.
🎻🎻🎻

7, ఆగస్టు 2020, శుక్రవారం

ఆశ అవసరమే..కానీ ...

ఆశ అవసరమే..కానీ ...(ఇలపావులూరి మురళీ మోహన రావు)

                  @@@@

ఏ మనిషి అయినా జీవితంలో సుఖంగా జీవించడానికి డబ్బు సంపాదించాలి.  కానీ, దానికి ఒక పరిమితి ఉండాలి.  అంటే సంపాదనకు కాదు.  వయసుకు.  అరవై ఏళ్లపాటు చెమటోడ్చి సంపాదిస్తాము.  ఇల్లూవాకిళ్ళు, బాంక్ బాలన్స్ ఏర్పాటు చేసుకుంటాం.  ఎన్ని అవసరాలు వచ్చినా తీర్చుకోగల ఆర్థికశక్తిని సమకూర్చుకుంటాము.  ఎంత సంపాదించినా మనిషిలో ఆశ మాత్రం చావదు.  ఎనభై ఏళ్ళు దాటినా ఇంకా సంపాదించాలి..ఇంకా కూడబెట్టాలనే వాంఛ మాత్రం చావదు.  వయసు పెరిగేకొద్దీ సత్తువ ఉడిగిపోతుంది.  కళ్ళు మసకబారుతాయి.  జుట్టు మొత్తం రాలిపోతుంది.  దంతాలు ఊడిపోతాయి.  ఎముకల్లో పటుత్వం పోతుంది.  చర్మం ముడుతలు పడి తోలుతిత్తిగా మారుతుంది.   వినికిడిశక్తి తగ్గుతుంది.  జ్ఞాపకశక్తి హరించుకునిపోతుంది.    అయినప్పటికీ ఆశ అనేది నిత్యయవ్వనంతో మిసమిసలాడుతుంటుంది!     శరీరంలో అనేకరకాల వ్యాధులు తిష్టవేస్తాయి.  మృత్యువు సమీపంలోనే ఉంటుంది.    ఆ పరిస్థితిలోనూ  ఇంకా సంపాదించాలనే యావ  మాత్రం చావదు.     వారి కొడుకులు, కూతుళ్లు, మనవళ్ళు కూడా ఆర్ధికంగా ఉన్నత స్థాయికి ఎదిగి ఉంటారు.   ఇరుగుపొరుగువాళ్ళు ఆకలికి మలమల మాడుతున్నా , వారికి ఒక్క పూట భోజనం పెట్టాలనిపించదు.  బంధువుల్లో, మిత్రుల్లో ఎంతోమంది దురదృష్టం కొద్దీ వ్యాధులతో బాధపడుతూ సర్జరీలు చేయించుకోవడానికి, వైద్య ఖర్చులకు  ఆర్థికసాయం కోసం ఎదురుచూసేవారున్నా, వారికి నయాపైసా సాయం చేయాలనిపించదు.    ఎంతోమంది పేదపిల్లలు ఫీజులు కట్టే స్తోమతు లేక బాల్యంలోనే చదువు మానేస్తారు.  అలాంటి నలుగురు పిల్లలకు చదువు చెప్పించి వారి జీవితాలను ఉద్ధరించాలనే ఆలోచన కూడా రాదు.   అప్పటికే  వేలకోట్ల రూపాయలను ఆర్జించి, దేశం మొత్తం ఆస్తులను పోగేసుకుని,  ఎనభై ఏళ్లకు చేరువైనా ఇంకా షూటింగులు,   మీటింగులు, కాంట్రాక్టులు, కమీషన్లు,  రాజకీయాలు,  వ్యాపారాలు అంటూ తిరిగే వారిని చూస్తే నాకు చచ్చే జాలి వేస్తుంది.  
        
ఒక మహాపండితుడు ఉన్నాడు.   అయన సకలశాస్త్ర పారంగతుడు.  కానీ,  దరిద్రముతో ఓడుతున్నాడు.    ఆయన ఒకరోజు పొరుగు రాజ్యం వెళ్లి అక్కడి రాజును కలిసి తన పాండిత్యంతో మెప్పించాడు.   మనిషి స్వభావాన్ని,  ధనవ్యామోహాన్ని,  దురాశను,  నైతిక పతనాన్ని సోదాహరణంగా వివరిస్తూ పెద్ద ఉపన్యాసం చేశాడు.   రాజుగారు ఆయన పాండిత్య వైభవానికి అబ్బురపడి "మీకు ఏమివ్వాలో నాకు తెలియడం లేదు.  ఎంత ఇచ్చినా తక్కువే.  నా రాజ్యం మొత్తం ఇచ్చినా దోషం లేదు.  అయితే అది సాధ్యం కాదు కాబట్టి  ఒక పని చేస్తాను.  రేపు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ మీరు నా రాజ్యంలో ఎంత దూరం నడుస్తారో, ఆ భూమి అంతా మీకే చెందుతుంది.  మా అధికారులు మీ వెనుకే వస్తారు"  అని అందుకు తగినట్లుగా అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు.  

మరునాడు సూర్యోదయం కాగానే పండితుడు నడక ప్రారంభించాడు.  అరగంటసేపు నడిచిన తరువాత పరిగెత్తితే ఇంకా ఎక్కువ భూమి కవర్ అవుతుందని తోచగానే పరుగు ప్రారంభించాడు.  మధ్యాహ్నం పన్నెండు గంటలవరకు నలభై కిలోమీటర్ల దూరం పరిగెత్తాడు.  ఎండ నిప్పులు కక్కుతున్నది.  మంచినీళ్లు తాగుదామని అనిపించినా, రెండు నిముషాలు ఆగితే కనీసం అరకిలోమీటరు భూమిని కోల్పోతానని అనిపించి లేని శక్తిని కూడగట్టుకుని పరుగు వేగాన్ని పెంచాడు.  ఒంటిగంట అయింది.  "బ్రాహ్మణోత్తమా...భోజనవేళ  అయింది.  భోంచెయ్యండి.  అరగంటసేపు విశ్రాంతి తీసుకోండి"  అని కేకలు పెట్టారు వెనుకే గుర్రాలమీద వస్తున్న అధికారులు.   అయితే బ్రాహ్మణుడు మాత్రం "తనకు రావాల్సిన భూమిని తగ్గించి ఆదా చేసుకోవడానికే అధికారులు భోజనం నెపంతో ఆగమంటున్నారు"  అని అనుమానించి  ఇంకా వేగంతో పరిగెత్తడం మొదలు పెట్టాడు.  

సాయంత్రం ఆరుగంటలయ్యేసరికి సూర్యుడు పడమర దిక్కున వాలిపోయాడు.  పండితుడు కూడా సత్తువ మొత్తం చచ్చిపోయి, నాలుక పిడుచగట్టి, భయంకరమైన శిరోభారంతో తల బరువెక్కి, మోకాళ్ళు నొప్పులతో నీరసంగా నేలమీద వాలిపోయాడు.  భూమి మొత్తం గిర్రున తిరుగుతున్నది.  కళ్ళు తెరుచుకోవడం లేదు...అధికారులు అతడిని  సమీపించి "పండితోత్తమా...ఇదిగో మీరు మొత్తం పరిగెత్తినది వంద కిలోమీటర్ల దూరం.  ఆ భూమి మొత్తం మీదే.    ఇవిగో అధికారిక  పత్రాలు.  స్వీకరించి సంతకం చెయ్యండి"  అని కాగితాలను అందించారు.  

పండితుడికి నోట మాట రావడం లేదు.   దాహంతో నాలుక కుదించుకుని  గొంతులోపలికి  వెళ్ళిపోయింది .   ఆయాసంతో వగరుస్తున్నాడు.  ఆయన కళ్ళకు కాగితాలు కనిపించడం లేదు.  మహిషవాహనుడు పాశం చేబూని కనిపిస్తున్నాడు.  పండితుడికి తన భవిష్యత్ అర్ధం అయింది.  బలవంతంగా చేతులు జోడించి " ఎంత చదువుకున్నా, ఎంత విజ్ఞానం సంపాదించినా, ఆశను మాత్రం జయించలేకపోయాను.  ఇప్పుడు నాకు కావలసింది వంద కిలోమీటర్ల భూమి కాదు.  ఆరు అడుగుల నేల.  అది ఇప్పించండి చాలు"  అని తల వాల్చేశాడు!

మనిషి ఆశతో జీవించాలి.  దురాశతో మాత్రం కాదు.  ఒక వయసు వచ్చాక, సంపాదనను సద్వినియోగం చేసినవారే ధన్య జీవులు.  స్వర్లోకానికి వెళ్ళేటప్పుడు ఒత్తి చేతులతో వెళ్ళరాదు.  కాసింత పుణ్యాన్ని మూటగట్టుకుని వెళ్ళాలి.  మరో ఉత్తమ జన్మకు అదే మన పెట్టుబడి!   (ఇలపావులూరి మురళీ మోహన రావు)

18, జూన్ 2020, గురువారం

-- 32 శ్రీమధాంద్ర భాగవతము

Srimadhandhra Bhagavatham -- 32 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ఒకరోజున సతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. పైన అందరూ విమానములలో  వెళుతూ వాళ్ళు  ‘దక్షప్రజాపతి యాగం చేస్తున్నాడు ఆహ్వానం వచ్చింది. అందుకని మనందరం వెడుతున్నాం’ అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి క్రిందికి దిగి శివుడి దగ్గరకు వచ్చి ‘స్వామీ! పుట్టింట్లో ఏదయినా ఉత్సవము జరుగుతున్నప్పుడు ఆడపిల్ల మనసంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట. నాకు నా తండ్రిగారు చేస్తున్న యాగమునకు వెళ్ళాలని అనిపిస్తోంది. మనం కూడా యాగానికి వెళదాం’ అన్నది. తమకు ఆహ్వానం రాలేదు కదా అన్నట్లుగా శంకరుడు సతీదేవికేసి చూశాడు. ఆయన మనస్సులోని భావనను ఆమె పసిగట్టి ‘కొంతమంది పిలిస్తేనే వెళ్ళాలి కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి. తండ్రిగారి ఇంటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళవచ్చు అన్నది. శంకరుడు ‘దేవీ! నీవు చెప్పినది యధార్థమే. పిలుపు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సవము జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు.   నేను కూడా ఒక మాట చెపుతాను విను. నేను లేచి నమస్కరించ లేదని నీ తండ్రిగారు నన్నొక సభలో అవమానం చేసి మాట్లాడారు. ఇప్పటికి కూడా వారు నాయందు అనుకూల్యతతో ఉండరు. ఇప్పుడు మనం వెడితే తలుపు తీసి అసలు పలుకరించరు. వాళ్ళు మనలను చాలా దారుణముగా అవమానిస్తారు.  బంధువయినా సరే ఆదరణ లేనప్పుడు ఎంతగొప్పవాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు వెళ్ళవద్దు’ అని చెప్పాడు. ఆవిడ ‘నాకు వెళ్ళాలని అనిపిస్తోంది’ అన్నది. శివుడు ‘అయితే నీవు వెళ్ళవచ్చు’ అన్నాడు ఆయన త్రికాలజ్ఞుడు అన్నీ తెలుసు.
 తల్లి పుట్టింటికి బయలుదేరింది. ఆమె కాళ్ళకు ఉన్నటువంటి గజ్జెలు మ్రోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమథగణములు అందరూ అమ్మవారి వెంట బయలుదేరారు. అమ్మవారి పుట్టింటికి వచ్చేసరికి దక్షప్రజాపతి ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. పరవారం అంతా కూర్చుని ఉన్నారు. వృషభవాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహము ఉంటే పసుపు కుంకుమలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహము ఉంటే ఐశ్వర్యం వస్తుందో  ఆ తల్లి తన కూతురి దాక్షాయణి అని పేరుపెట్టుకుని నడిచి వస్తోంది. దక్షుడు లేవలేదు పలకరించలేదు. తండ్రి తన భర్తను నిందించాడు. వచ్చిన కూతురు మీద తండ్రి ప్రేమను చూపించలేదు. ఆమె చాలా బాధపడింది. దీనిని మణిభద్రుడన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమయిన తేజస్సుతో చూస్తోంది. ఆమె సమస్తబ్రహ్మాండములను కాల్చివేయగల శక్తి. ప్రమథగణములు చూసాయి. విచ్చుకత్తులు పైకి తీసి ఈ దక్షుడిని చంపి అవతల పారేస్తామన్నాయి. అమ్మవారు వారించింది. దక్షుడిని తనవద్దకు పిలిచి పరమశివుని నీ చిత్తం వచ్చినట్లు కూశావు. నీకొక మాట చెపుతున్నాను ‘ఎవరయినా శంకరుణ్ణి నిందచేస్తే వాని నాలుక పట్టి పైకి లాగి కొండనాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు. అలా నీకు చేయడానికి అధికారము లేని పక్షంలో ఉత్తరక్షణం శివనింద ఎక్కడ జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటకు వెళ్ళిపోయి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు అన్నం తినడం మానివేయాలి. నువ్వు దుర్మార్గుడివి. దుష్టాత్ముడివి. శంకరుణ్ణి నిందచేశావు. నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకముందు నేను ఎప్పుడయినా పరమపవిత్రుడయిన శంకరుని సాన్నిధ్యంలో కూర్చుని వుంటే దాక్షాయణీ అని పిలుస్తారు. దుర్మార్గుడవయిన నీ కుమార్తెగా పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. నేను ఈ శరీరమును వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతాను’ అని పద్మాసనము వేసుకుని కూర్చుని ప్రాణాపానవ్యాన వాయువులను నాభిస్థానమునందు నిలబెట్టింది. ఆపైన ఉదానవాయువును హృదయం మీద నుంచి పైకి తీసుకువచ్చి కనుబొమల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములు అన్నిటిలో నుంచి  అనిలము అనే అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్నియందు శరీరమును దగ్ధం చేసి బూడిదకుప్పయి  క్రిందపడిపోయింది. సభలో హాహాకారములు మిన్నుముట్టాయి. ప్రమథగణములకు ఎక్కడలేని కోపంవచ్చి కత్తులుతీసి దక్షుడి మీద పడ్డారు. భ్రుగుడికి చాలా సంతోషం కలిగింది. వెంటనే హోమం చేసి అందులోంచి ‘రుభులు’ అనబడే దేవతలను సృష్టించి రుద్రగణములను తరిమి కొట్టించాడు. ఈ విషయములను నారదుడు వెళ్ళి శంకరునకు చెప్పాడు. ఆయన ప్రశాంతముగా ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్న శంకరునకు ఎక్కడలేని కోపం వచ్చింది. శాంతమూర్తి శివుడు రుద్రుడయి ఒక్కసారి లేచి పెద్ద వికటాట్టహాసం చేసాడు. ఆ నవ్వుకి బ్రహ్మాండములు కదిలిపోయాయి. మెరిసిపోతున్న జటనొకదానిని ఊడబెరికి నేలకేసి కొట్టాడు. ఒక్కసారి అందులోంచి ఒక పెద్ద శరీరం పుట్టింది. ఆ శరీరమును చూసేటప్పటికి అందరు హడలిపోయారు. వీరభద్రావతారం ఉద్వేగముతో ఒక్కసారి దూకి శంకరుని పాదములకి నమస్కరించి బయల్దేరాడు. బయల్దేరేముందు పరమశివుడికి ప్రదక్షిణం చేసి ‘తండ్రీ! నాకు ఏమి ఆనతి?’ అని అడిగాడు. శంకరుడు ‘సతీదేవి శరీరమును విడిచిపెట్టింది. దక్షయజ్ఞమును ధ్వంసం చెయ్యి’ అన్నాడు.
వీరభద్రుడు ఒక పెద్ద శూలం పట్టుకు బయలుదేరాడు. ఆయనతో ప్రమథ గణములన్నీ వస్తున్నాయి. ఆ శబ్దమును యాగంలో వున్న వాళ్ళు విన్నారు. దక్షప్రజాపతి భార్య ఉపద్రవం వచ్చేసింది అనుకున్నది. వీరభద్రుడు రుద్రగణములతో కలిసి యజ్ఞమంటపములన్నిటినీ పడగొట్టేశాడు. పిమ్మట నందీశ్వరుడు భ్రుగువు దగ్గరకు వెళ్ళాడు. ‘ఆనాడు సభలో శంకరనింద  జరుగుతుంటే కళ్ళు ఎగురవేసిన వాడివి నీవేకదా! ఇప్పుడు దానికి తగినశిక్ష అనుభవిస్తావు’ అని గడ్డం క్రింద ఎడమచెయ్యి వేసి పట్టుకొని ముంజికాయను బొటనవ్రేలు పెట్టి పైకెత్తేసినట్లు బొటనవేలితో రెండు కనుగుడ్లు ఉత్తరించేశాడు.   భ్రుగుడి కళ్ళు ఊడి క్రిందపడిపోయాయి. ‘పూష’ అనే సూర్యుడు ఉన్నాడు. ‘ఏమయ్యా! నువ్వు శంకరనింద జరుగుతుంటే నోరు పెద్దగ తెరచి నవ్వావు. నీకు శిక్ష చూడు’ అని ఆయన నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. రెండుదవడలు తెరిచి పళ్ళు పీకేశారు. ఆఖరున వీరభద్రుడు దక్షప్రజాపతి దగ్గరకు వెళ్ళాడు. ఆయనను క్రిందపారేసి గుండెలమీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠమును కోసేశాడు. దక్షుని శరీరం అంతా మంత్రపూతము కంఠం తెగలేదు ఆశ్చర్యపోయాడు. ఎలా త్రుంచాలని ఆలోచించాడు. ‘ ఈ దుర్మార్గుడు శివ నింద చేసినందుకు యజ్ఞపశువు శరీరమును తుంచినట్లు తుంచేస్తానని గుండెలమీద కుడికాలు వేసి తొక్కిపట్టి తోటకూరకాడను తిప్పినట్లు కంఠమును తిప్పి ఊడబెరికి దానిని తీసుకువెళ్ళి యజ్ఞములో వెలుగుతున్న అగ్నిహోత్రములో పడేసాడు. ఆ శిరస్సు యజ్ఞంలో కాలిపోయింది. తలలేని మొండెం ఉండిపోయింది. అక్కడ వాళ్ళని రక్షించినవాడు లేదు. శివనింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేదదృష్టి ఎంత ప్రమాదకరమో వ్యాసుల వారు జాతికి భిక్ష పెట్టి చెప్తున్నారు. మనం ఈశ్వరుడిని ఒక్కడిగా చూడడం నేర్చుకోవాలి లేకపోతే పాడైపోతాము. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ‘అయ్యా! పాపకర్మ చేసాము దానివలన ఇంత ఉపద్రవం వచ్చింది. ఏమి చేయమంటావు?’ అని అడిగారు.
 బ్రహ్మగారు ‘పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? ఎందుకు ఆ యజ్ఞం? మీకు ఒక్కటే మార్గం. మీరు ఎవరిపట్ల తప్పు చేశారో  ఆయన దగ్గరకు వెళ్ళి కాళ్ళమీద పడండి . ఎన్నితప్పులు చేసినా కాళ్ళమీద పడితే రక్షిస్తాడు’ అని సలహా చెప్పాడు. వాళ్ళు ‘మాతో నీవు కూడా రావలసింది’ అని ప్రార్థించారు. ‘సరే పదండి’ అని బ్రహ్మగారు వారితో కైలాసం వెళ్ళారు. వీరు వెళ్లేసరికి అత్యంత ప్రశాంతచిత్తుడై ఒక రావిచెట్టు క్రింద శంకరుడు కూర్చుని ఉన్నాడు. బ్రహ్మగారు వెళ్ళి పరమశివుని ముందు స్తోత్రం చేశారు. అయ్యా! తెలియక నీపట్ల దోషం చేశారు. నీవు సాక్షాత్తు పరబ్రహ్మవు. సృస్టి, స్థితి, లయ ఈ మూడు నీయందు జరుగుతుంటాయి. తెలియని వారు ఈ రకంగా అపచారబుద్ధితో ప్రవర్తించారు. వీరిని క్షమించు’ అన్నారు.
మహానుభావుడు భోళాశంకరుడు కదా! అభయంకరుడు. ‘మీ అందరికీ నిష్కల్మష చిత్తంతో అభయం ఇస్తున్నాను.’ యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎవరు యజ్ఞము చేయాలో అటువంటి దక్షప్రజాపతికి ఈవేళ ముఖం లేదు. దక్షుని మొండెమునకు గొర్రె ముఖమును తీసుకువెళ్ళి అతికించండి. మిగిలిన యజ్ఞభాగము పూర్తిచేస్తాడు. పూష తానూ ఏదయినా తినవలసి వచ్చినపుడు యజమాని దంతములతో తింటాడు. భ్రుగునికి నేత్రములు ఇస్తాను. ఇకనుంచి తాను తినవలసినటువంటి హవిస్సులు భ్రుగువుకి కనపడతాయి. ఎవరెవరు దెబ్బలు తిన్నారో ఎవరెవరు అంగవికలురు అయ్యారో వాళ్ళందరికీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును సంతోషంతో పూర్తి చేసుకోండి’ అని వరములను ఇచ్చేశాడు. దక్షప్రజాపతికి గొర్రె తలకాయ తీసుకు వెళ్ళి పెట్టారు. వెంటనే ఆయన లేచి నిలబడి పరుగెత్తుకుంటూ కైలాసమునకు వచ్చి శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు. ‘స్వామీ! నీవు నన్ను దండించడమును రక్షణగా భావిస్తున్నాను. దీనివలన ఇక భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరూ ఇటువంటి అపరాధములు చేయకుందురు గాక!   నన్ను మన్నించు’ అని నమస్కరించాడు. శంకరుడు వెళ్ళి యాగమును పూర్తిచెయ్యి అన్నాడు. తరువాత దక్షప్రజాపతి తన యజ్ఞమును పూర్తిచేసి శ్రీమన్నారాయణుని స్తోత్రంచేస్తే అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. ‘స్వామీ! నీవు యజ్ఞభర్తవి అని నమస్కరించాడు. ఎవరు దక్షయజ్ఞ ద్వంసమును చదువుతున్నారో వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి శివనామమును చెప్తూ కైవల్యమును పొందగలరు. అంత గొప్ప ఫలితమును దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు.

30, మే 2020, శనివారం

ఉపమన్యువు

ఉపమన్యువు 

       @@@

ఇది శివపురాణంలో ఒక ఘట్టం.  

ఉపమన్యువు ఒక బ్రాహ్మణ బాలుడు.   విధివశాత్తూ బంధువుల నిరాదరణకు గురైన ఇతని తల్లి ఇతడు పసిబాలునిగా ఉన్నప్పుడే ఒక అడవిని చేరుకొని అక్కడ చిన్న గుడిసెను నిర్మించుకుని జీవిస్తున్నది.  పసివాడు కావడంతో ఆకలితో ఏడ్చినప్పుడు అతనికి ఆహారం పెట్టలేక నీటిలో కొంచెం వరిపిండిని కలిపి పాల మాదిరిగా తయారుచేసి ఇచ్చేది తల్లి.  అయితే అవి రుచించక నాకు పాలు కావాలి అని మారాము చేస్తాడు ఉపమన్యువు.  "ఈ అడవిలో నేను పాలను ఎక్కడినుంచి తీసుకురాగలను?" విచారంగా చెప్పింది తల్లి.  

అపుడు ఉపమన్యువు "నేను పరమేశ్వరునికోసం తపస్సు చేసి పాలను సాధిస్తాను"  అని తపస్సుకు కూర్చుంటాడు.   చూస్తుండగా అది ఘోరతపస్సుగా మారుతుంది.   కైలాసంలో అగ్నిశిఖలు ఉద్భవిస్తాయి.   ఆ వేడికి మంచుకొండలు కరిగిపోతున్నాయి.   అపుడు పరమేశ్వరుడు దయతలచి ముందుగా ఈ బాలుడి చిత్తశుద్ధిని పరీక్షించాలనే అభిమతంతో ఇంద్రుని రూపంలో ప్రత్యక్షం అవుతాడు.  "ఏమి వరం కావాలో కోరుకో బాలకా" అంటాడు.  "నేను శివుని కోసం తపస్సు చేస్తున్నాను.   "నువ్వు అక్కర్లేదు వెళ్ళు" అని చెప్పి మళ్ళీ తపంలో మునిగిపోతాడు ఉపమన్యువు.  శివుడు నవ్వుతూ "నీకు వరం ఇవ్వడానికి ఎవరైతే ఏమి?  నీకు కావలసింది ఇస్తాను. కోరుకో. శివుణ్ణి మెప్పించడం చాలా కష్టం"  అంటాడు.  

 ఉపమన్యువు సమ్మతించక "నేను చేసే తపస్సు  మహాశివునికోసం మాత్రమే.  ఎంతకాలమైనా తపస్సు చేస్తాను.  నువ్వు వెళ్ళిపో" అని కమండలం నుంచి మంత్రజలాన్ని తీసుకుని చల్లుతాడు.  ఆ జలం దేహంపై పడగానే ఇంద్రుడి రూపం తొలిగిపోతుంది.  శివుడు నిజరూపంలో ప్రత్యక్షమై ఉపమన్యువు కోరుకొగానే పాలు పెరుగు సమృద్ధిగా లభించాలని వరం ప్రసాదించి అదృశ్యమై పోయాడు.  

***

పై కథనుంచి మనం తీసుకోవలసిన నీతి ఏమిటి?  

దేనికైనా పట్టుదల, కృషి, శ్రమ అవసరం.  ఏదైనా శ్రమించి సాధించాలి.  కష్టే ఫలి అన్నారు పెద్దలు.  మనలో కోరికలు ఉండవచ్చు.  కానీ, అవి మనముందుకు వచ్చి వాలిపోవు.  వాటిని సాధించడానికి మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలి.  గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే దీపం వెలగదు.  ఇక్కడ శివుడిని ఒక దేవుడిగా చూడరాదు.  మన శ్రమ, కృషి లో చిత్తశుద్ధి ఉంటే దయగల ధర్మాత్ములు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తారు.  

ఏదీ తనంత తానై నీ దరికి రాదు 
శోధించి సాధించాలి 
అదియే ధీరగుణం 

అంటారు మహాకవి శ్రీశ్రీ

27, మే 2020, బుధవారం

ఉత్తముడు

ఉత్తముడు 

                @@@

ఇది మార్కండేయపురాణంలో చెప్పబడిన విలువైన నీతి కథ.  

ఉత్తానపాదుడు-సురుచి అనే రాజ దంపతులకు జన్మించాడు. ధ్రువుడికి సవతి సోదరుడు.  యితడు పెద్దయ్యాక బహుళ అనే ఒక అందగత్తెను పెళ్లి చేసుకున్నాడు.  కానీ ఆమెకు ఇతనంటే చిన్న చూపు.  ఇతని మాటలను లక్ష్యపెట్టేది కాదు.  ఒకనాడు రాజబంధువులు పదిమంది కూర్చుని విందు ఆరగిస్తున్నపుడు ఉత్తముడు ఒక గ్లాసులో మధువును నింపి భార్యకు ఇవ్వబోగా ఆమె తిరస్కరించింది.  నలుగురిలో తనను అవమానించిందని ఆగ్రహించి భటులను పిలిచి ఆమెను అడవుల్లో వదిలేసి రమ్మని ఆజ్ఞాపించాడు.  ఇష్టం లేని భర్తతో కాపురం కన్నా, అడవుల్లో జీవితమే ఉత్తమని ఆమె కూడా ఆవేశంలో పతిని తూలనాడి భటులతో వెళ్ళిపోయింది.   అంతటి అందమైన, కోరి చేసుకున్న  భార్యను ఆవేశంలో  అడవులకు పంపినందుకు ఏమాత్రం సిగ్గుపడలేదు ఉత్తముడు.  

కొంతకాలం తరువాత ఉత్తముడి కొలువుకు సుశర్మ అనే వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి తన భార్యను ఎవరో అపహరించారని, ఆమెను తనకు తెచ్చి ఇవ్వమని ఫిర్యాదు చేశాడు.  ఆమె ఎలా ఉంటుందని అడిగాడు ఉత్తముడు.  నల్లగా, పొట్టిగా, వికారంగా, వృద్ధాప్యపు ఛాయలతో ఉంటుందని చెప్పాడు సుశర్మ.   ఉత్తముడు పెద్దగా నవ్వి "అలాంటి భార్య పోయిందని ఆనందించక  ఏడుస్తావెందుకు?  సంతోషించు?"  అన్నాడు హేళనగా.   పురుషుడు ఒకసారి ఒక కన్యను వివాహం చేసుకున్న తరువాత ఆమె కుంటిదైనా, గుడ్డిదైనా జీవితాంతమూ ప్రేమించాలని, యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె మన కోరికలు అన్నీ తీర్చడమే కాక, పిల్లలను కని, పెంచి, పెద్దచేసి, మన వంశాన్ని నిలబెట్టిందనే సత్యాన్ని మరువకూడదని, భార్య భార్యేనని చెబుతాడు సుశర్మ.

ఆమెను వెతకడం కోసం ఉత్తముడే స్వయంగా అడవులకు వెళ్తాడు.  దారిలో దాహమై ఒక ముని ఆశ్రమానికి వెళ్లి తాను ఆ దేశానికి రాజును అని పరిచయం చేసుకుని కాసిని మంచినీళ్లు ఇమ్మని అడుగుతాడు.  ఒక శిష్యుడు గ్లాసుతో మంచినీరు తెచ్చి రాజు చేతికి ఇవ్వకుండా  దూరంగా నేలమీద పెడతాడు.  ఉత్తముడు ఆశ్చర్యపోయి తాను మహారాజును అని తెలిసీ కూడా అగౌరవంగా గ్లాసును  నేలమీద ఎందుకు ఉంచావు అని ప్రశ్నిచాడు.  భార్యావిహీనులు మునులనుంచి అర్ఘ్యపాద్యాదులు స్వీకరించడానికి అనర్హులు అని బదులిస్తాడు ముని.  

ఉత్తముడు బాధపడి తాను ఒక మహిళకు వెతుకుతున్నాను అని చెపుతాడు.  అపుడు ముని తన దివ్యదృష్టితో పరిశీలించి ఒక రాక్షసుడు ఆమెను తీసుకెళ్లి బంధించాడు అని ఆ వివరాలు చెబుతాడు.  దాని ప్రకారం ఉత్తముడు వెళ్లి రాక్షసుని కలిసి " బ్రాహ్మణ స్త్రీని ఎందుకు ఎత్తుకొచ్చావు?" అని ప్రశ్నించగా " సుశర్మ రాక్షసంహారం కోసం యాగం చేస్తున్నాడు.  భార్య లేనివాడు యాగానిర్వహణకు అనర్హుడు కాబట్టి ఆమెను ఎత్తుకొచ్చాను"  అని బదులిస్తాడు. భార్య యొక్క విలువ ఏమిటో గ్రహించిన   ఉత్తముడు పశ్చాత్తాపం చెంది  రాక్షసుని ఒప్పించి ఆమెను స్వాధీనం చేసుకుని తన భార్య ఎక్కడుందో చెప్పమని వేడుకుంటాడు.  రాక్షసుడు ఆమెను ఒక వనరాక్షసుడు అపహరించాడని చెప్పగా ఉత్తముడు సుశర్మ భార్యతో సహా ఆ ప్రాంతానికి వెళ్లి తన భార్యను తిరిగి తెచ్చుకుంటాడు.  

****

పై కథలోనుంచి నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి?  

సంసారం అంటే ఒక్క భర్త మాత్రమే కాదు.  భర్త సంపాదించి కుటుంబాన్ని పోషిస్తాడు అనేది నిజమే కావచ్చు (ఒకప్పటి మాట సుమా!)  కానీ, భార్య అనేది కూడా ఒక పదవి.  మహారాజు పదవి ఎలాంటిదో, మహారాణి పదవి కూడా అలాంటిదే.  రాజుకు ఉన్నట్లే మహారాణికి కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. భార్య అంటే భర్త కింద అణిగిమణిగి పడి ఉండే దాసీ కాదని మన పురాణాలు ఏనాడో గుర్తించాయి.  అందుకే భార్యలేనివాడు పూజలకు, యాగాలకు అనర్హుడుగా ప్రకటించారు మన మహర్షులు.  ఎందుకంటే మగవాడు తన బుద్ధిని వక్రమార్గం పట్టించకుండా, భార్యను కాపాడుకోవాలని, ఆమె లేని జీవితం వ్యర్థమని పై గాధ మనకు బోధిస్తున్నది.

21, మే 2020, గురువారం

అశ్వినీదేవతలు

అశ్వినీదేవతలు 

                 @@@

ఇది భారతంలో చెప్పబడిన వృత్తాంతం.

సూర్యుని భార్య సంజ్ఞాదేవి.  సూర్యుడు ఈమెతో రమించడానికి వచ్చినపుడు అతని తేజస్సును భరించలేకపోయేది.  చివరకు ఒకరోజు  ఇంటినుంచి కురుదేశానికి  పారిపోయి  అక్కడ ఒక ధనవంతుడి ఇంట్లో దాసిగా పనికి కుదిరి జీవితాన్ని సాగిస్తున్నది.  సూర్యుడు గుర్రం రూపాన్ని ధరించి భార్యను వెతుక్కుంటూ వివిధ దేశాలను తిరుగుతూ  ఒకరోజు కురుదేశాన్ని చేరుకొని తన భార్యను గుర్తించాడు.  ఆమె కూడా అశ్వరూపంలో ఉన్న భర్తను గుర్తించింది.  చాలా కాలం తరువాత ఆలుమగల సంయోగం కారణంగా ఇద్దరు కుమారులు జన్మించారు.  సూర్యుడు అశ్వరూపంలో ఉండగా వీరి బీజం పడిన కారణంగా వీరికి అశ్వినులు అనే పేరు వచ్చింది.  వీరి అసలు నామధేయాలు నాసత్యుడు, దస్రుడు.  

వీరు అపూర్వ బుద్ధికుశలతతో పెరిగి అనేక వైద్యవిద్యలు అభ్యసించారు.  వీరి నైపుణ్యం, ప్రతిభను గమనించిన దేవేంద్రుడు వీరిని దేవతలకు వైద్యుడుగా ఉండమని కోరడంతో వీరు దేవతల ఆస్థానవైద్యులు అయ్యారు.  

ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే వీరు పురాణాల్లో తొలి శస్త్రవైద్యులు.  అంటే చాలా పెద్ద సర్జన్లు.  దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగినపుడు దేవతల కాళ్ళు, చేతులు విరిగినపుడు వీరు ఇనుముతో తయారు చేసిన కాళ్ళు, చేతులను దేహాలకు అమర్చేవారు.  

చ్యవన మహర్షి వృద్ధాప్యంలో సుకన్యను వివాహం చేసుకున్నాడు.  ఆమె  భర్తపట్ల విరక్తురాలై ఉన్నపుడు దాన్ని గమనించిన అశ్వినులు చ్యవన మహర్షిని ఒక నదిలో స్నానం చేయించి యవ్వనవంతుడుగా మార్చారు.  

 ****

పై కథలో మనం గ్రహించవలసిన రహస్యం ఏమిటి?

ఇవాళ కాళ్ళు, చేతులు కోల్పోయినవారికి కృత్రిమ అవయవాలు అమర్చడం మనం చూస్తున్నాము.  ఆ విజ్ఞానం మన పురాణాలలోనే ఉన్నదని తెలియడం లేదూ?  మన అపూర్వ విజ్ఞానం, వైద్యవిజ్ఞానం...ప్రతిభాపాటవాలు శతాబ్దాలతరబడి సాగిన పరాయి దేశస్తుల పాలనలో సర్వం విధ్వంసం అయిపొయింది.  ఈరోజు చిన్న చిన్న సమస్యలకు  కూడా విదేశాలు పరిగెత్తుతున్నాము.