ss

ss
my

10, మే 2020, ఆదివారం

నిగమశర్మ

- నిగమశర్మ 

@@@

నిగమశర్మ గాథ పద్మపురాణం లోనిది.  
 
పీఠికాపురం అనే బ్రాహ్మణ అగ్రహారం లో ఒక పండితుని కుమారుడు.  చిన్నప్పటినుంచి చదువు వంట పట్టలేదు.  ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ దుష్టులతో తిరుగుతుండేవాడు.  పెద్దయ్యాక వేశ్యాగృహాలకు వెళ్లడం, వారికి సొమ్ము ఇవ్వడానికి దొంగతనాలు చెయ్యడం లాంటి దుష్టకార్యాలకు తెగిస్తూ తల్లితండ్రులకు ఆవేదన కలిగిస్తున్నాడు.  

  ఇతడి చేష్టలతో విసుగెత్తిన తండ్రి తన పెద్ద కుమార్తె  ఇంటికి పంపి తమ్ముడిని ఎలాగైనా దారిలో పెట్టమని ఉత్తరం రాసి పంపిస్తాడు.     ఆమె సోదరుడిని  శ్రద్ధగా చూస్తూ చదువుకోమని, తల్లితండ్రుల సేవచేసుకోమని బోధిస్తుండేది. కొన్నాళ్ల తరువాత నిగమశర్మ ఒక రాత్రివేళ  సోదరి  నగలను దొంగిలించి  పారిపోతాడు.  ఒక అడవిలోంచి యితడు పారిపోతుండగా కొందరు దొంగలు చూసి శర్మను చావగొట్టి నగలు లాగుకొని వెళ్తారు.  

  ఆ దారివెంట వెళ్తున్న ఒక పెద్దమనిషి స్పృహలేకుండా పడివున్న నిగమశర్మ ను చూసి జాలిపడి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. బ్రాహ్మణుడు కావడంతో భార్యాభర్తలు ఇద్దరు ఇతడిని ఆదరంగా చూస్తుంటారు.  కొన్ని రోజులు అక్కడ ఉండి, మెల్లగా పెద్దమనిషి భార్యకు గేలం వేసి లొంగ దీసుకుని ఒక శుభముహూర్తాన ఆమెను తీసుకుని లేచిపోతాడు.  

  కొన్నాళ్ల తరువాత ఒకరోజు ఆమె నగలు కాజేసి ఆమెను ఒంటరిగా విడిచి పారిపోతాడు.  అలా వెళ్తూ వెళ్తూ నారసింహ తీర్ధం అనే ఒక పుణ్యక్షేత్రానికి చేరుకొని అక్కడ ప్రాణం విడుస్తాడు.  పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం లో మరణించడం తో అతని పాపాలన్నీ నశించి నేరుగా స్వర్గలోక ప్రాప్తిని పొందుతాడు.  

                 @@@@  

 పై కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి?  

ఎన్ని నేర్చినా, ఎన్ని చదివినా హీనుడు అవగుణాలను మానలేడు.  నీళ్లలో కొట్టుకునిపోతున్న తేలును రక్షిద్దామని చెయ్యి చాపితే అది వెంటనే మనలను కుడుతుంది.  పుర్రెతో పుట్టిన బుద్ధి పుడకలతో గానీ పోదు.  అల్పులకు, నీచులకు, వారు ఎంత దగ్గరివారైనా ఆశ్రయం ఇవ్వరాదు.  మనవారే కదా అని ఆదరించరాదు.  మీ సొంత సోదరీ సోదరులు అయినా సరే, వారి బుద్ధి మంచిది కాదు అనుకున్నపుడు చేరదీయరాదు.  దుష్టమనస్కుల మీద జాలి చూపించరాదు.  పుణ్యానికి పొతే పాపం చుట్టుకుంటుంది.   అల్లుడే కదా అని జాలి చూపి ఆదరించిన ఎన్టీఆర్ కు ఎలాంటి గతి పట్టిందో మనం చూశాం.

 ఎంత కరిగించిన గాని, ఇత్తడి బంగారం కాబోదు అని తెలుసుకున్నవాడు తెలివైనవాడు అని గ్రహించాలి.

కామెంట్‌లు లేవు: