ss

ss
my

29, డిసెంబర్ 2009, మంగళవారం

పిసినారి దంపతులు

ఒక అగ్రహారం లో రాజయ్య, సీతమ్మ అనే దంపతులు వుండేవారు. ఒకరికి పెట్టే మాట ఎలా వున్నా ...తమ కడుపులకు కూడా తృప్తిగా తినే వారు కాదు. తింటే ఖర్చు అయి పోతుంది అనేది వారి ఆలోచన. తేరగా వస్తుంది అంటే ఆమడ దూరమైనా వెళ్ళే వారు. తమకి ఖర్చు అనుకొంటే మూల ఇంటి లోంచి బయటకు రారు.

ఒక రోజు పొరుగూరు నుండి రంగయ్య అనే చుట్టం పని మీద వాళ్ళింటికి వచ్చాడు. వచ్చిన వాడు పనిచూసుకుని వెళ్లి పోకుండా రాజయ్యతో కబుర్లాడుతూ కూర్చున్నాడు. ఎంత సేపటికి కదలకుండా మాటలు కొనసాగించడం తనకి ఇష్టం లేక పోయినా ...పొమ్మన లేక తలూపుతూ వుండి పోయాడు రాజయ్య.

మధ్యాహ్నమైంది.

తనకి ఆకలి అవుతుంది. వచ్చిన చుట్టం వెళ్లి పోయాక తినాలనేది రాజయ్య ఆలోచన. ఇంత సేపు వున్నానుగదా... వేళకి నాలుగు మెతుకులు తిని వెళదామని రంగయ్య ఆలోచన.

చివరికి విధిలేక మాటవరసకి " రంగయ్య గారూ...! భోజనానికి లేవండి.. ! " అన్నాడు రాజయ్య.

" ఇప్పుడు భోజనం ఎందుకులే రాజయ్య గారూ.. వూరికి వేళతానులే ...! " కాస్త మొహమాటంగా వుంటుందని చెప్పాడు రంగయ్య.

వెళ్లి పోతానన్న చుట్టాన్ని కాసింత బ్రతిమాలి వదిలేద్దామనిపించింది రాజయ్యకు.

" పర్లేదులే.. ..! రెండు మెతుకులు తిని వెళ్ళండి... " అన్నాడు పైకి గంభీరంగా రాజయ్య.

" సరే.. రాజయ్య గారూ... ! మరీ మొహమాట పెడుతున్నారు. .." అని ,... లేచి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకు రావటానికి బావి వైపు నడిచాడు రంగయ్య.

గతుక్కు మన్నాడు రాజయ్య. ...! పోయే పీడా తగిలించు కున్నానే అనుకుంటూ ....గబగబా భార్య దగ్గరకు పరుగెత్తి విషయం చెప్పి " సీతా ఇప్పుడెలా.. "అని అడిగాడు.

" అయ్యో..! నేను మన ఇద్దరికీ మాత్రమె వండాను. అది మీ ఇద్దరికీ పెట్టి నేను ఈ పూటకి పస్తు వుంటాను....! " చెప్పింది సీతమ్మ.

కొంచెం సేపు ఆలోచించిన రాజయ్య.... " నీవు పస్తు వుండక్కర లేదు. నేను చెప్పి నట్లు చేయి.." అని చెవిలో చల్లగా చెప్పాడు.

సీతమ్మ తల వూపి సరేనంది.

రాజయ్య, రంగయ్య భోజనానికి కూర్చున్నారు. సీతమ్మ అన్నం తెచ్చింది. భర్త కంచం లో ఒక గరిట వేసింది. మరో గరిట వేయబోయింది.

అంతలో రాజయ్య చేయి అడ్డు పెడుతూ..." చాలు..చాలు..! ఆపు.. ! మనిషి పుట్టుక పుట్టిన వాడు ఇంత కంటే ఎక్కువ తింటాడా ఎంటి.. ! " అన్నాడు.

పెట్టడం ఆపేసింది సీతమ్మ. చూసాడు రంగయ్య. రాజయ్య కంచం లో పిడికిడు మెతుకులే వున్నాయి.
తర్వాత రంగయ్యకు వడ్డించింది.

ఒక గరిట వేయగానే.. " చాలు...చాలు... " అన్నాడు రంగయ్య అంత కంటే ఎక్కువ తింటే తనని మనిషి క్రింద లెక్క వేయరని....!

కూర తెచ్చి ఒక గరిట వేసి రెండో గరిట వేయ బొగా.." ఆపు.. నేనెలా కనబడుతున్నాను... ! " అన్నాడు రాజయ్య.

అప్పటికే రంగయ్య పరిస్తితి అర్ధం చేసుకున్నాడు. తానూ ఒక గరిట కూర తోనే సరిపెట్టుకున్నాడు.

" రాజయ్య పిసినారి అని తెలుసు గాని ..... మరీ యింత పనికిమాలిన పిసినారి వెధవ అనుకోలేదు... ! బుద్ధి వుంటే జీవితం లో మరెప్పుడూ ఈ యింటి చాయలకు రాకూడదు.! " అని మనసులో అనుకున్నాడు రంగయ్య.

" రాజయ్య గారూ..! చాలా 'తృప్తిగా ' భోజనం పెట్టారు. జీవితం లో మీ ఆతిధ్యాన్ని మరిచిపోలేను.....! " అని వారి వద్ద సెలవు తీసుకుని బయలదేరాడు రంగయ్య.

భర్త తెలివి తేటలకి మురిసిపోయింది సీతమ్మ. ఎంతయినా భర్తకి తగ్గ భార్య కదా....!

మిగిలింది తృప్తిగా తిన్నారు దంపతులిద్దరూ...!

గణతంత్ర దినోత్సవం

రాజ్యాంగం వచ్చిన రోజు
రాజరికం పోయిన రోజు
దేశ ప్రజలందరి పండుగ రోజు
అదే..అదే.. మన గణతంత్రపు రోజు

ఆంతరంగిక.. బాహ్య విషయాలలో
ఏ విదేశీ శక్తికి లోబడని
స్వతంత్ర దేశంగా నిలిచింది
సర్వసత్తాక రాజ్య మైంది

ఆర్ధిక అంతరాలను తగ్గిస్తూ
దేశ పురోభివృద్దిని కోరుతూ
వెనుకబడిన వారికి అండగా నిలిచి
సామ్యవాద రాజ్య మైంది..

వివిధ మతాల నిలయం
మత ప్రమేయం లేని విధానం
తటస్త మత వైఖరి కలిగి
లౌకిక రాజ్య మైంది..

ప్రజల కొరకు వెలిసింది
ప్రజల చేత ఏర్పడింది
ప్రజలే పాలకులై పాలించే
ప్రజాస్వామ్య రాజ్య మైంది..

రాజరికపు వారసత్వాలకు
ముగింపు పలికింది
ఎన్నికలే పాలకులకు కొలబద్ధయి
గణతంత్ర రాజ్య మైంది..

25, సెప్టెంబర్ 2009, శుక్రవారం

సెప్టెంబర్ 24 2009

నా జీవితంలో సెప్టెంబర్ 24 2009 ఒక ముఖ్యమైన రోజు
నా జీవితానికి ఒక ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించని ఈ రోజు నేను చనిపొయేవరకు మరువలేను

29, ఆగస్టు 2009, శనివారం

కొన్ని క్లిష్టమైన పదాలు

కొన్ని క్లిష్టమైన పదాలు

* విజ్ఞానము vij~nAnamu
* రామ్ rAm
* ఫైర్‌ఫాక్స్ fair^faaks
* హోమ్‌పేజీ hOm^pEjI
* ఎంజైమ్‌ eMjaim
* ఆన్‌లైన్ An^lain
* లిమ్కా limkA
* ఎక్స్‌ప్లోరర్ eks^plOrar
* వ్యాఖ్యానం vyAkhyAnaM
* అనిశ్చితి aniSciti
* దుఃఖసాగరం du@hkhasaagaram
* తెలుఁగు telu@Mgu
* ఆమ్లం aamlaM లేదా AmlaM

హరిబాబు.యస్ పి: ప్రత్యేక అక్షరాలు

హరిబాబు.యస్ పి: ప్రత్యేక అక్షరాలు

ప్రత్యేక అక్షరాలు

* ఌ = ~l
* ౡ = ~L
* అరసున్నా (ఁ) = @M
* సున్నా = M
* విసర్గ (ః) = @h
* అవగ్రహ (సంస్కృతం) = @2
* నకార పొల్లు = @n
* ఖాళీ స్పేసు = _ (అండర్‌స్కోర్)

* సిలబల్ బ్రేక్ (ఫైర్‌ఫాక్స్ లాంటివి రాయటానికి) = ^ (ఇది ZWNJ చేర్చుతుంది)
* ఫోర్స్ కాంబినేషన్ = & (ఇది ZWJ చేర్చుతుంది)

* చాప లోని చ = ~c (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)
* జాము రాతిరి లోని జ = ~j (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)

కొన్ని ఉదాహరణలు

dESa bhAshalaMdu telugu lessa - దేశ భాషలందు తెలుగు లెస్స

telugulO vrAyaDam ippuDu kashTaM kAdu - తెలుగులో వ్రాయడం ఇప్పుడు కష్టం కాదు

viSvadAbhirAma vinuravEma - విశ్వదాభిరామ వినురవేమ

SrI madbhagavadgIta tatvavivEcanI vyAkhya - శ్రీ మద్భగవద్గీత తత్వవివేచనీ వ్యాఖ్య

fair^fAks veb^braujar - ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్

yAvatprapancAnikI cATiceppanDi. - యావత్ప్రపంచానికీ చాటిచెప్పండి.

హరిబాబు.యస్ పి: "తెలుగు అక్షరాలు"

హరిబాబు.యస్ పి: "తెలుగు అక్షరాలు"

హరిబాబు.యస్ పి: తెలుగు సాహితీ చరిత్ర - ముఖ్యమైన ఘట్టాలు

హరిబాబు.యస్ పి: తెలుగు సాహితీ చరిత్ర - ముఖ్యమైన ఘట్టాలు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ

మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనేది తెలుగులో ప్రాచుర్యం కలిగిన, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే రాష్ట్ర గీతంగా అధికారికంగా స్వీకరించబడిన ఒక గేయం. ఈ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి. ఈ గేయంలో తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించాడు.

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి


అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!


విశేషాలు

* ప్రఖ్యాత గాయిని, నటి టంగుటూరి సూర్యకుమారి ఆలాపన ద్వారా అప్పటిలో ఈ గేయం బాగా జనాదరణ పొందింది.

* సుప్రసిధ్ధ దర్శకుడు బాపు, బుల్లెట్ చిత్రం కోసం ఈ పాటను బాలసుబ్రమణ్యం తో పాడించారు.

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- క్ష

క్ష

* క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు
* క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం వెయ్యాలి
* క్షేమంగా పోయి లాభంగా రండి

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- హ



* హనుమంతుడి ముందా కుప్పిగంతులు
* హనుమంతుడు... అందగాడు...
* హరిశ్చంద్రుని లెంపకాయ కొట్టి పుట్టినాడు
* హాస్యగాణ్ణి తేలుకుట్టినట్లు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- స



* సంక నాకే వాడిని సంభావన అడిగితే పొర్లించి పొర్లించి ముడ్డి నాకాడట
* సంతులేని ఇల్లు చావడి కొట్టం
* సంతోషమే సగం బలం
* సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట
* సంపదలో మరపులు ఆపదలో అరుపులు
* సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట
* సుపుత్రుడి కోసం సప్తసముద్రాలు ములిగితె,ఉప్పు కలుగు తగిలి వున్నది కాస్తా ఊడింది
* సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు
* సత్రం భోజనం మఠం నిద్ర
* సన్నాయి నొక్కులే గానీ... సంగీతం లేదన్నట్లు...
* సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంట
* సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టం
* సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
* సర్వేజనా:సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా? మరి మా సంగతేమిటి? అన్నారట మిగతావాళ్ళు
* సాయిబ్బు సంపాదన బూబు కుట్టు కూలికి సరిపోయినట్లు
* సింగడు అద్దంకి వెళ్లినట్టు
* సింగినాదం జీలకర్ర
* సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి
* సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చింది
* సూది కోసం సోది కెళితే పాత రంకంతా బయట పడిందిట
* సొమ్మొకడిది సోకొకడిది
* సాటివారితో సరిగంగ స్నానాలాడబోతే ముసలి మొగుడ్ని మొసలి ఎత్తుకెళ్ళిందట
* సిరికొద్దీ చిన్నెలు, మొగుడి కొద్దీ వన్నెలు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- ష



* షండునికి రంభ దొరికినట్లు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- శ



* శంఖులో పోస్తేగాని తీర్ధం కాదని
* శృతి ముదిరి రాగాన పడింది
* శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట
* శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికొచ్చినోళ్లంతా నా పెద్దపెళ్లాలు అన్నాడట
* శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు
* శతకోటి లింగాలలో బోడిలింగం
* శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట
* శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు
* శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
* శెనగలు తింటూ ఉలవలని చెప్పి పత్తివిత్తులు చేతిలో పెట్టినట్లు
* శొంఠి లేని కషాయం లేదు
* శ్వాస ఉండేవరకే ఆశ ఉంటుంది

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- వ



* వంగలేక మంగళవారం అన్నాడంట
* వండుకు తినేవాడికి ఒక కూర అడుక్కు తినేవాడికి అరవైనాలుగు కూరలు
* వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి
* వస్తే కొండ పోతే వెంట్రుక
* వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు
* వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
* విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు
* వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది
* వీపు విమానం మోత మోగుతుంది
* వేపకాయంత వెర్రి
* వేగం కన్నా ప్ర్రాణం మిన్న
* వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు
* వేసేటప్పుడు వేప మొక్క తీసేటప్పుడు అమ్మవారు
* వాడికి సిగ్గు నరమే లేదు
* విగ్రహపుష్టి నైవేద్యనష్టి
* వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి
* విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది
* వెధవ ముండ యాత్రకు పోతే వెతకను కొందరు, ఏడవను కొందరు
* వంకరటింకర పోతుంది పాము కాదు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs)-- ల



* లంఖణం పరమౌషధం
* లంఖణం చెయ్యమంటేనే ఉపవాసానికి ఒప్పుకున్నట్టు
* లేడికి లేచిందే పరుగు
* లేని దాత కంటే ఉన్న లోభి నయం
* లోగుట్టు పెరుమాళ్ళ కెరుక

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- ర



* రాజ్యాలు పోయినా కిరీటాలు వదల్లేదని
* రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?
* రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే, మొత్తబుద్ది అవుతుంది
* రాజుల సొమ్ము రాళ్ళ పాలు,దొరల సొమ్ము దొంగల పాలు
* రాత రాళ్ళేలమని ఉంటే... రాజ్యాలెలా ఏలుతారు...?
* రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు
* రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు
* రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టు చుట్టుకూ పొట్ట చూసుకుందట
* రెక్కాడితే గానీ డొక్కాడదు
* రెంటికీ చెడిన రేవడి చందాన
* రెడ్డొచ్చె మొదలాడు
* రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
* రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే
* రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట
* రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరువ దీరునా?
* రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
* రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు
* రౌతు కొద్ది గుర్రం

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- మ



* మంగలిని చూసి గాడిద కుంటినట్లు
* మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు
* మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంట
* మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి తూలుతున్నడు
* మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి
* మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
* మందెక్కువైతే, మజ్జిగ పల్చనవుతుంది
* మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట
* మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?
* మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు
* మంచి మనిషికొక మాట మంచి గొడ్డుకొక దెబ్బ
* మందుకని పంపిస్తే మాసికం నాటికి వచ్చే రకం
* మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలక బోసుకున్నట్లు
* మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు
* మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు
* మాటకు మా ఇంటికి... కూటికి మీ ఇంటికి అన్నట్లు
* మాటలు కోటలు దాటుతాయి కాని కాళ్ళు గడప దాటనట్లు
* మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె
* మింగ లేక మంగళవారం అన్నాడట
* మింగ మెతుకులేదు కాని, మీసాలకు సంపెంగ నూనె
* ముంజేతి కంకణానికి అద్దమేల ?
* మునిగి పోయే వాడికి గడ్డి పూస దొరికినట్లు
* ముందు నుయ్యి వెనుక గొయ్యి
* ముందుంది ముసళ్ళ పండుగ
* ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి
* ముడ్డి గిల్లి జోల పాడటమంటే ఇదే
* ముడ్డిలో పుండు మామగారి వైద్యం
* ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి
* ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు
* మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?
* మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు
* మొండివాడు రాజు కన్నా బలవంతుడు
* మొక్కయి వంగనిది, మానయ్యాక వంగునా?
* మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు
* మొగుడు పోయి తానేడుస్తుంటే మిండమొగుడు రమ్మని రాళ్ళేశాడంట
* మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టు
* మొదులు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు
* మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి యాడనో పెట్టుకున్నాడంట
* మొరిగే కుక్క కరవదు
* మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు
* మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు
* మౌనం అర్ధాంగీకారం
* మొదటి దానికి మొగుడు లేడు కాని, కడదానికి కళ్యాణము అన్నట్లు
* ముహూర్తం చూసుకుని యాత్రకు బయల్దేరితే ముందరి మొగుడు ఎదురు వచ్చాడట

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- బ



* బతకలేక బడి పంతులని
* బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయంట
* బతికి పట్నం చూడాలి...చచ్చి స్వర్గం చూడాలి
* బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టినట్టు
* బ్రతికుంటే బలుసాకు అమ్ముకుని బతకొచ్చు
* బ్రతికుంటే బలుసాకు తినొచ్చు
* బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు
* బారు బంగాళాఖాతం, కొంప దివాలా ఖాయం
* బుగ్గ గిల్లి జోల పాడటం
* బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరావు
* బెల్లం చుట్టూ ఈగల్లా
* బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడట
* బోడితలకు బొండుమల్లెలు ముడిచినట్లు

* బెదిరించి బెండకాయ పులుసు పోసినట్లు

* భోగం ఇల్లు తగలబడిపోతోందంటే గోచీలు విప్పుకుని పరుగెత్తారంట
* భక్తిలేని పూజ పత్రి చేటు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- ప



* పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు
* పండగ నాడు కూడా పాత మొగుడేనా?
* పండిత పుత్ర: పరమ శుంఠ:
* పండితపుత్రుడు... కానీ పండితుడే...
* పందికేంతెలుసు పన్నీరు వాసన
* పక్కలో బల్లెం
* పగలంతా బారెడు నేశా రాత్రికి రారా దిగ నేస్తా అన్నట్టు
* పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
* పట్టుకోక ఇచ్చినమ్మ పీటకోడు పట్టుకు తిరిగిందంట
* పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లు
* పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది
* పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి
* పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు
* పరువం మీద వున్నపుడు పంది కూదా అందంగా ఉంటుంది
* పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?
* పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?
* పాకేటప్పుడు పంది నడిచేటప్పుడు నంది
* పావలా కోడికి ముప్పావలా దిష్టి
* పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా!
* పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేలు లెక్కెసు కుందట
* పాలు, నీళ్ళలా కలిసిపోయారు
* పిండి కొద్దీ రొట్టె
* పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
* పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట
* పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు
* పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
* పిచ్చోడి చేతిలో రాయి
* పిచ్చోడికి పింగే లోకం
* పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ
* పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ వుండవచ్చునన్నాడంట
* పిల్లికి కూడాబిచ్చం పెట్టనివాడు
* పిల్లికి ఇరకాటం ఎలుకకు ప్రాణ సంకటం
* పుండుకు పుల్ల మొగుడు
* పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో గానీ పోదు
* పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు
* పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు
* పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి
* పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
* పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు
* పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం
* పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు
* పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు
* పెరుగుట విరుగుట కొరకే
* పెళ్ళాము అంటే బెల్లము తల్లి తండ్రి అల్లము
* పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టు
* పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే
* పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట
* పైన పటారం, లోన లొటారం
* పొట్టోడికి పుట్టెడు బుద్దులు
* పొమ్మనలేక పొగపెట్టినట్లు
* పొయ్యి దగ్గర పోలీసు
* పొరుగింటి పుల్లకూర రుచి
* పెళ్ళీకి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) - -న



* నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట
* నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది
* నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు!
* నలుగురితో నారాయణా
* నల్లటి కుక్కకు నాలుగు చెవులు
* నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోవిటిని నమ్మకూడందట
* నవ్విన నాపచేనే పండుతుంది
* నాగస్వరానికి లొంగని తాచు
* నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు
* నిండా మునిగిన వానికి చలేంటి
* నిండు కుండ తొణకదు
* నిఙ౦ నిప్పులా౦టిది
* నిజం నిలకడమీద తెలుస్తుంది
* నిత్య కళ్యాణం, పచ్చ తోరణం
* నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది
* నిప్పు ముట్టనిదే చేయి కాలదు
* నిప్పులేనిదే పొగరాదు
* నివురు గప్పిన నిప్పులా
* నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట
* నీటిలో రాతలు రాసినట్లు
* నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో
* నీతిలేని పొరుగు నిప్పుతో సమానం
* నీపప్పూ నా పొట్టూ కలిపి వూదుకు తిందామన్నట్లు
* నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను
* నూరు చిలుకల ఒకటే ముక్కు
* నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది
* నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది
* నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు
* నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట
* నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు
* నేతిబీరలో నేతి చందంలా
* నేల విడిచి సాము చేసినట్లు
* నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు
* నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) - ధ



* ధర్మో రక్షతి రక్షితః
* ధైర్యే సాహసే లక్ష్మి

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- ద



* దండం దశగుణం భవేత్
* దంచినమ్మకు బొక్కిందే దక్కుదల
* దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట
* దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
* దానం చేయని చెయ్యి... కాయలు కాయని చెట్టు...
* దాసుని తప్పు దండంతో సరి
* దిక్కులేనివారికి దేవుడే దిక్కు
* దిగితేనేగాని లోతు తెలియదు
* దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు
* దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి
* దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడట
* దున్నపోతు మీద రాళ్ళవాన పడ్డట్టు
* దున్నపోతు మీద వానకురిసినట్లు
* దురాశ దుఃఖానికి చేటు
* దూరపుకొ౦డలు నునుపు
* దెయ్యాలు వేదాలు వల్లించినట్లు
* దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
* దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు
* దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లు
* దొందూ దొందే
* దొరికితే దొంగలు లేకుంటే దొరలు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- త



* తంగేడు పూచినట్లు
* తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపం
* తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునా
* తంబళ అనుమానము
* తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు
* తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వచ్చునా
* తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ
* తగిలిన కాలే తగులుతుంది
* తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య ఇచ్చిన మనుముకూ
* తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు
* తడిగుడ్డలతో గొంతులు తెగకోస్తాడు
* తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగానీ మొగ్గడు
* తడిశిన కుక్కి బిగిశినట్టు
* తడిశి ముప్పందుం మోశినట్టు
* తణుకుకు పోయి మాచవరం వెళ్ళినట్లు
* తద్దినము కొని తెచ్చుకొన్నట్టు
* తనకంపు తనకింపు, పరులకంపు తనకు వొకిలింపు
* తన కలిమి ఇంద్రబోగము, తనలేమి లోకదారిద్ర్యము
* తన కాళ్లకు బంధాలు తానే తెచ్చుకొన్నట్టు
* తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును
* తనకు కానిది గూడులంజ

* తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట
* తడి గుడ్డతో గొంతులు కొయ్యడం
* తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
* తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
* తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడట
* తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా
* తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
* తల లేదు కానీ చేతులున్నాయి... కాళ్లు లేవు కానీ కాయం ఉంది?
* తల ప్రాణం తోకకి వచ్చినట్లు
* తలనుంచి పొగలు చిమ్ముచుండు భూతము కాదు, కనులెర్రగనుండు రాకాసి కాదు, పాకిపోవుచుండు పాముకాదు
* తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
* తవుడు తింటూ వయ్యారమా?
* తాను వలచినది రంభ, తాను మునిగింది గంగ
* తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు
* తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట
* తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
* తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది
* తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు
* తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట
* తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు
* తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు
* తాతకు దగ్గులు నేర్పినట్టు
* తాదూర సందు లేదు, మెడకో డోలు
* తానా అంటే తందానా అన్నట్లు
* తామరాకు మీద నీటిబొట్టులా
* తాను దూర సందు లేదు తలకో కిరీటమట
* తినటానికి తిండి లేదు మీసాలకు సంపెంగ నూనె
* తిని కూర్ఛుంటే కొండలైనా కరుగుతాయి
* తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి
* తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు
* తిండికి ముందు,తగాదాకు వెనుక ఉండాలి
* తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట
* తిట్టను పోరా గాడిదా అన్నట్టు
* తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు
* తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట
* తినగ తినగ వేము తియ్యగనుండు
* తినబోతూ రుచులు అడిగినట్లు
* తిన్నింటి వాసాలు లెక్కేయటం
* తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?
* తీగ లాగితే డొంకంతా కదిలినట్లు
* తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి
* తుమ్మితే ఊడి పొయే ముక్కు ఉన్నా ఒక్కటె ఊడినా ఒక్కటె
* తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...
* తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య
* తేలు కుట్టిన దొంగలా
* తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
* తోక తెగిన కోతిలా
* తోక త్రొక్కిన పాములా
* తోక ముడుచుట
* తోచీ తోయనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- ఢ



* ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
* డబ్బు ఇవ్వని వాడు ముందు పడవ ఎక్కినట్టు
* డబ్బు లేని వానికి బోగముది తల్లి వరస
* డొంకలో షరాఫు ఉన్నాడు, నాణెము చూపుకో వచ్చును

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- డ



* డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు
* డబ్బు కోసం గడ్డి తినే రకం
* డబ్బుకు లోకం దాసోహం
* డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు
* డౌలు డస్తు పగలు పస్తు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- జ



* జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల
* జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది
* జన్మకో శివరాత్రి అన్నట్లు
* జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు
* జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి
* జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు
* జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే
* జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు
* జోడు లేని బ్రతుకు తాడులేని బొంగరం
* జలుబుకు మందు తింటే వారంరోజులు తినకపోతే ఏడురోజులు ఉంటుందన్నట్లు
* జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- ఛ



* ఛారాన కోడికి బారాన మసాల.

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- చ



* చంకలో మేక పిల్లని పెట్టుకుని ఊరంతా వెదికినట్టు
* చక్కనమ్మ చిక్కినా అందమే
* చక్కని చెంబు, చారల చారల చెంబు, ముంచితే మునగని ముత్యాల చెంబు
* చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం
* చదవేస్తే ఉన్న మతి పోయినట్లు
* చదువు రాక ముందు కాకరకాయ... చదువు వచ్చాక కీకరకాయ
* చదువుకున్నోడికన్నా చాకలోడు మేలు
* చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు
* చనిపోయిన వారి కళ్ళు చారెడు
* చల్లకొచ్చి ముంత దాచినట్లు
* చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు
* చాప క్రింది నీరులా
* చారలపాపడికి దూదంటి కుచ్చు
* చారాణా కోడికి భారాణా మసాలా
* చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు
* చింత చచ్చినా పులుపు చావనట్టు
* చిత్తం చెప్పులమీద దృష్టేమో శివుడిమీద
* చిత్తశుద్ది లేని శివపూజలేల
* చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి
* చీదితే ఊడిపోయే ముక్కు తుమ్మితే ఉంటుందా!
* చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు
* చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం
* చెడపకురా చెడేవు
* చెప్పేవాడికి వినేవాడు లోకువ
* చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు
* చెముడా అంటే మొగుడా అన్నట్టు
* చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు
* చెవిలో జోరీగ
* చేతకాక మంగళవారమన్నాడంట
* చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు
* చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి
* చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు...
* చెరువు మీద అలిగి....స్నానం చేయనట్లు
* చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- గ



* గంగిగోవు పాలు గరిటడైన చాలు
* గంజి తాగేవానికి మీసాలు ఎగబట్టేవాడొకడన్నట్టు
* గంతకు తగ్గ బొంత
* గతి లేనమ్మకు గంజే పానకము
* గాజుల బేరం భోజనానికి సరి
* గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
* గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట
* గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట
* గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట
* గుండ్లు తేలి... బెండ్లు మునిగాయంటున్నాడట
* గుంపులో గోవిందా
* గుడ్డి కన్నా మెల్ల నయము కదా
* గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు
* గుడ్డోడికి కుంటోడి సాయం
* గుడ్డెద్దు చేలో పడినట్లు
* గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు
* గురివింద గింజ తన నలుపెరగదంట
* గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట
* గుర్రం ఎక్కుతా, గుర్రం ఎక్కుతా అని, గుద్దంతా కాయకాసి కూర్చున్నడంట..!
* గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు
* గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?
* గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా
* గూటిలో కప్ప పీకితే రాదు
* గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు
* గోటితో పోయేదానికి గొడ్డలెందుకు
* గోడకేసిన సున్నం
* గోతి కాడ నక్కలా
* గోరంత ఆలస్యం కొండొంత నష్టం
* గోరుచుట్టు మీద రోకటిపోటు
* గాడిదకు తెలియునా గంధం పొడి వాసన;పంది కేమి తెలియును పన్నిటి వాసన

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- క



* కంగారులో హడావుడి అన్నట్లు
* కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు
* కంచలమా కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని
* కంచానికి ఒక్కడు - మంచానికి ఇద్దరు
* కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు
* కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
* కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
* కంచేచేను మేసినట్లు
* కంటికి ఇంపైతే నోటికీ ఇంపే
* కంటికి రెప్ప కాలికి చెప్పు
* కంటికి రెప్ప దూరమా
* కండలేని వానికే గండం
* కందకి లేని దురద కత్తిపీటకెందుకు?
* కందకు లేదు చేమకు లేదు తోటకూరకెందుకు దురద
* కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
* కంపలో పడ్డ గొడ్డు వలె
* కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు
* కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్పిబాధ ఎరుగడు
* కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు
* కట్టని నోరు కట్ట లేని నది ప్రమాద కరము
* కట్టుకున్నదానికి కట్టు బట్టల్లేవు కానీ, ఉంచుకున్నదానికి ఉన్ని బట్టలు కొంటానన్నాడట
* కట్టేవి కాషాయాలు - చేసేవి దొమ్మరి పనులు
* కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే
* కడుపుతో ఉన్నామె కనక మానుతుందా
* కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?
* కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది
* కణత తలగడ కాదు. కల నిజం కాదు
* కనులు మూడు గలవు కాడు త్రినేత్రుండు పక్షిగాదు చెట్టుపైన నుండు జలము దాల్చి యుండు నీల మేఘుండు గాడు దీని భావమేమి తిరుమలేశ
* కన్ను పోయేంత కాటుక పెట్టదన్నట్లు...
* కన్నెర్రపడ్డా మిన్నెర్రపడ్డా కురవక తప్పదు
* కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం
* కర్రలేని వాడిని గొర్రె కూడా కరుస్తుంది
* కలసి ఉంటే కలదు సుఖం
* కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు
* కల్లు త్రాగిన కోతిలా
* కళ్ళు కావాలంటాయి కడుపు వద్దంటుంది
* కాకి పిల్ల కాకికి ముద్దు
* కాగల కార్యం గంధర్వులే తీర్చారు
* కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది
* కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్లు
* కాలు కాలిన పిల్లిలా
* కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది
* కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది
* కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ
* కాసుకు గతిలేదుకానీ... నూటికి ఫరవాలేదన్నట్లు
* కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
* 'కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?' అంటే 'స్వరూపాలెంచటానికి అందిట.
* కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు
* కుండలో కూడు కుండలోనుండవలె, పిల్లలు చూడ గుండులవలెనుండవలె
* కుక్క కాటుకి చెప్పు దెబ్బ
* కుక్క కి చెప్పు తీపి తెలుసు కానీ ...చెరకు తీపి తెలుస్తుందా
* కుక్క తోక పట్టి గోదారి దాటాలనుకొన్నట్లు
* కుక్కతోక వంకరన్నట్లు...!
* కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు...
* కూటికి లేకున్నా కాటుక మాననట్లు
* కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట
* కూనను పెంచితే గుండై కరవ వచ్చినట్లు
* కూర్చుని తింటే, కొండలైనా తరిగిపోతాయి
* కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
* కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు
* కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు
* కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
* కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట
* కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు
* కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు
* కొత్తల్లుడిని మేపినట్లు మేపుతున్నారు
* కొన్నది వంకాయ కొసరింది గుమ్మడి కాయ అన్నట్లు..
* కోరి కొరివితో తల గోక్కున్నట్టు
* కోటి విద్యలు కూటి కొరకే
* కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డి నాకింది
* కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం
* కోల ఆడితేనే కోతి ఆడుతుందన్నట్లు
* కోస్తే తెగదు కొడితే పగలదు
* క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడంట
* కల్ల పసిడికి కాంతి మెండు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- అం

అం

* అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని
* అంగడి వీధిలో అబ్బా! అంటే, ఎవడికి పుట్టేవురా కొడుకా? అన్నట్లు
* అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే
* అంచు డాబే కాని, పంచె డాబు లేదు
* అంటుకోను ఆముదం లేదుకాని,మీసాలకు సంపెంగ నూనె.
* అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.
* అంతంత కోడికి అర్థశేరు మసాలా.
* అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతాత కొప్పు
* అంత ఉరుము ఉరుమి ఇంతేనా కురిసింది అన్నట్లు
* అంతా మనమంచికే.
* అంత్య నిష్ఠూరం కన్నా, ఆది నిష్ఠూరం మేలు.
* అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు
* అందని ద్రాక్ష పుల్లన
* అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు.
* అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు
* అందరూ శ్రీవైష్ణవులే- బుట్టెడు రొయ్యలు మాయ మయాయి.
* అందితే జుట్టు అందకపోతే కాళ్లు
* అందితే తల, అందకపోతే కాళ్లు
* అంధుడికి అద్దం చూపించినట్లు
* అంబలి తాగేవాడికి మీసాలొత్తేవాడొకడు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- ఓ



* ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు
* ఓర్చినమ్మకు తేట నీరు
* ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య
* ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయి

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- ఒ



* ఒడ్డునుండి ఎన్నయినా చెప్తారు
* ఒక దెబ్బకు రెండు పిట్టలు
* ఒల్లని భార్య చేయి తగిలినను ముప్పే, కాలు తగిలినను తప్పే
* ఒడిలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు
* ఒళ్ళు బలిసిన పూజారి అమ్మవారిని పట్టుకున్నాడట

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- ఏ



* ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టు
* ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
* ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
* ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము
* ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
* ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
* ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు
* ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే
* ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు
* ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు
* ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే
* ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు
* ఏనుగులు పడితే ఏనుగులే లేపాలి కాని పీనుగుల వల్ల కాదు
* ఏమండీ కరణం గారూపాతర లో పడ్డారే అంటే, కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట
* ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని
* ఏరు ఏడామడ ఉండగానే చీర విప్పి చంకన బెట్టుకొందట
* ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
* ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs)-- ఎ



* ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట
* ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు
* ఎంత చెట్టుకి అంత గాలి
* ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు
* ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు
* ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది
* ఎడ్డె తిక్కలామె తిరణాల పోతే, ఎక్కా దిగా సరిపోయింది
* ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు
* ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితేనేమి?
* ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
* ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి?
* ఎద్దు పుండు కాకికి ముద్దు
* ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు
* ఎద్దుగా ఏడాది బతికే కంటే ఆబోతుగా ఆరునెలలు బతికినా చాలు
* ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు
* ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టినట్లు
* ఎవడి బ్లాగుకు వాడే సుమన్ అని

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs)-- ఊ



* ఊరు ఊరు పోట్లాడుకుని మంగలం మీద పడి ఏడ్చినట్టు
* ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు
* ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు
* ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ
* ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి
* ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది
* ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు
* ఊళ్ళో పెళ్ళికి ఇంట్లో సందడి
* ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి
* ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు
* ఊరికి ఉపకారి ఆలికి అపకారి

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- ఉ



* ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు
* ఉట్టి గొడ్డుకి ఆకలెక్కువన్నట్లు
* ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు
* ఉపాయం లేని వాడిని ఊళ్ళోనంచి వెళ్ళగొట్టమన్నారు
* ఉన్న మాటంటే ఉలుకెక్కువ
* ఉన్నది పోయె ఉంచుకొన్నది పోయె
* ఉయ్యాల్లొ పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
* ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు
* ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- ఇ



* ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
* ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
* ఇంటికన్నా గుడి పదిలం
* ఇంటికి ఇత్తడి పురుగుకు పుత్తడి
* ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత
* ఇంట్లో పిల్లి వీధిలో పులి
* ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
* ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
* ఇద్దరు ముద్దు ఆపై వద్దు
* ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు
* ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
* ఇల్లలకగానే పండగకాదు
* ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
* ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
* ఇల్లు ఇరుకుగా ఉండాలి, పెళ్ళాం ఛ0ఢాలంగా ఉండాలి
* ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట
* ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట
* ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు
* ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం
* ఇల్లు పీకి పందిరి వేసినట్లు
* ఇసుక తక్కెడ పేడ తక్కెడ
* ఇల్లలకగానే పండగ కాదు
* ఇంటి ముందు ములగ చెట్టు వెనుక వేప చెట్టు ఉండరాదు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs)-- ఆ



* ఆ తాను ముక్కే
* ఆ మొద్దు లోదే ఈ పేడు
* ఆంబోతులా పడి మేస్తున్నావు
* ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు
* ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
* ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
* ఆకారం చూసి ఆశపడ్డానే కానీ... అయ్యకు అందులో పసలేదని నాకేం తెల్సు అన్నాట్ట...
* ఆకారపుష్టి నైవేద్యనష్టి
* ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
* ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వాచ్చాడట
* ఆకులేని పంట అరవైఆరు పుట్లు...
* ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు
* ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు...
* ఆడబోయిన తీర్థమెదురైనట్లు
* ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
* ఆత్రగాడికి బుద్ది మట్టం
* ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
* ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట
* ఆదిలోనే హంసపాదు
* ఆపదలో మొక్కులు... సంపదలో మరపులు
* ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు
* ఆ మరకా ఈ మరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి
* ఆయనే ఉంటే మంగలి ఎందుకు
* ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
* ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు
* ఆరోగ్యమే మహాభాగ్యం
* ఆలస్యం అమృతం విషం
* ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
* ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట
* ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే... చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట.
* ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
* ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?
* ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?
* ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు
* ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టే రకం
* ఆశగలమ్మ దోషమెరుగదు... పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) -- అ



* అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అట
* అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు
* అందని పండ్లకు అర్రులు చాచినట్లు
* అందని ద్రాక్షలు పుల్లన
* అందితే సిగ అందకపోతే కాళ్ళు
* అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు
* అంబలి తాగేవాడికి మీసాలు ఎక్కు పెట్టేవాడు ఒకడు
* అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం
* అంధుడికి అద్దం చూపించినట్లు
* అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ
* అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
* అగ్నికి వాయువు తోడైనట్లు
* అటునుండి నరుక్కు రా
* అడకత్తెరలో పోకచెక్క
* అడగందే అమ్మ అయినా పెట్టదు
* అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు
* అడిగేవాడికి చేప్పేవాడు లోకువ
* అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు
* అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు
* అడుసు తొక్కనేల కాలు కడగనేల
* అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు
* అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న
* అతి వినయం ధూర్త లక్షణం
* అతిరహస్యం బట్టబయలు
* అత్త సొమ్ము అల్లుడు దానం
* అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.
* అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు
* అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
* అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు
* అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు
* అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు
* అద్దం అబద్దం ఆడుతుందా !
* అనగా అనగా రాగం తినగా తినగా రోగం
* అనుమానం పెనుభూతం
* అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట
* అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు
* అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు
* అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు
* అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది
* అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు
* అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా?
* అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా?
* అప్పనుచూడబోతే రెప్పలు పోయినై
* అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది
* అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా?
* అప్పిచ్చువాడు వైద్యుడు
* అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చిచూడు
* అప్పు నిప్పులాంటిది...
* అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా?
* అప్పు చేసి కొప్పు తీర్చిందట
* అప్పుచేసి పప్పు కూడు
* అప్పులేని వాడే అథిక సంపన్నుడు
* అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు
* అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు
* అబద్ధము ఆడితే అతికినట్లుండాలి
* అభ్యాసము కూసువిద్య
* అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
* అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు
* అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు
* అమ్మబోతే అడవి కొనబోతే కొరివి
* అయితే అంగలూరు కాకపోతే సింగలూరు
* అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ గుండువెళ్ళి గుండావతిలో పడింది
* అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?
* అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో
* అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు
* అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు
* అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం
* అరచేతిలో వైకుంఠం చూపినట్లు
* అవ్వాకావలెను బువ్వా కావలెను
* అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు...
* అరిచే కుక్క కరవదు
* అరటిపండు ఒలచి చేతిలొ పెట్టినట్ట్లు
* అర్దరాత్రి మద్దెల దరువు
* అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా...
* అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
* అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట
* అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట
* అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు
* అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట

తెలుగులో ఆశ్చర్యార్థకాలు

వాడుక భాషలో


* అరె!
* అమ్మమ్మా!
* అమ్మయ్య!
* అన్నన్నా!
* అబ్బబ్బా!
* అవ్వవ్వా!
* అయ్యయ్యో!
* అవునా!
* అయ్యోరామ!


* ఆ...య్!
* ఆహాహా!


* ఓ!
* ఓరి!
* ఓసి!
* ఓర్ని!
* ఓహో!
* ఓయబ్బో!
* ఓహోహో!


* ఔరా!
* ఔరౌరా!


* ఛా!


* వరెవా!

గ్రాంథిక భాషలో
ప్రస్తుతం వాడుకలో లేనివి, కేవలం జానపద, పౌరాణిక చిత్రాలు చూసేటప్పుడు మాత్రమే వినబడేవి కొన్ని:

* అక్కటా!!
* అమ్మకచెల్ల!
* అహో!
* చాంగుభళా!
* భళి!
* భళా!
* మజ్ఝారే!
* అయ్యారే!

తెలుగు లిపి

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది.

అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపి లో వ్రాసిన అక్షరములు మొదట భట్టిప్రోలు లో దొరికాయి. అచటి బౌద్ధస్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి. ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి.

ఆవిర్భావము

తీరాంధ్రప్రాంతము, కృష్ణా నదీ తీరమున ఉన్న భట్టిప్రోలు గ్రామమందు క్రీ.పూ. 5వ శతాబ్దములో గొప్ప బౌద్ధస్తూపము నిర్మించబడినది . ఆ సమయములో బౌద్ధమతముతో బాటు మౌర్యుల కాలములో వాడుకలో నున్న బ్రాహ్మీ లిపి కూడ అచటకు చేరినది. ఈ లిపి దగ్గరలోనున్న ఘంటసాల, మచిలీపట్నం రేవులనుండి తూర్పు ఆసియా లోని బర్మా, థాయిల్యాండ్, లావోస్ మొదలగు దేశాలకు కూడ చేరి అచటి లిపుల ఆవిర్భామునకు కారణభూతమయింది. క్రీ.శ. ఐదవ శతాబ్దము నాటికి భట్టిప్రోలు లిపి పాత తెలుగు లిపిగా పరిణామము చెందింది.

మౌర్యులకాలపు (క్రీ.పూ. 3వ శతాబ్ది) బ్రాహ్మీలిపి పట్టికలోని రెండవ వరుసలో ఇవ్వబడినది. అటు పిమ్మట భట్టిప్రోలు ధాతుకరండముపై కొద్దిమార్పులుగల బ్రాహ్మీలిపి మూడవ వరుసలో చూడవచ్చును.

తెలుగు శాసనములు

శాతవాహనుల శాసనములు
శాతవాహనుల శాసనములలోని (క్రీ. శ 1వ శతాబ్ది) భట్టిప్రోలు లిపి పరిణామము 4వ వరుసలో ఇవ్వబడింది.

ఇక్ష్వాకుల శాసనములు
క్రీ.శ. 218 లో శాతవాహనుల సామంతులు ఇక్ష్వాకులు స్వతంత్రులైరి. వారికాలమునాటి లిపి 5వ వరుసలో గలదు

శాలంకాయన నందివర్మ శాసనము
ఇక్ష్వాకుల తరువాత శాలంకాయనులు ఆంధ్ర దేశాన్ని క్రీ. శ. 300 నుండి 420 వరకు పాలించారు. శాలంకాయనుల రాజధాని వేంగి. ఆకాలమునాటి లిపి 7వ వరుసలోనున్నది. ఈ కాలములోనే తెలుగు లిపి మిగిలిన దక్షిణ భారత మరియు ఉత్తర భారత లిపులనుండి వేరుపడుట ప్రారంభమయింది. క్రీ. శ. 420-611 మధ్యకాలములో విష్ణుకుండినులు వినుకొండ రాజధానిగా పరిపాలించారు.

విష్ణుకుండిన శాసనములు
విష్ణుకుండినుల పరిపాలనాకాలములో భాషల వాడుకలో, వ్రాతలో పలుమార్పులు వచ్చాయి. ప్రాకృతము బదులు సంస్కృతము వాడుట ఎక్కువయ్యింది. అదేసమయములో రాయలసీమను పాలించిన రేనాటి చోళులు రాజశాసనములు తెలుగులో వ్రాయించారు. మనకు దొరికిన వారి మొదటి శాసనము క్రీ. శ. 573 నాటిది. తీరాంధ్రప్రాంతములో దొరికిన క్రీ. శ 633 నాటి శాసనము మొదటిది. అప్పటినుండి తెలుగు వాడకము బాగా ఎక్కువయింది.

పల్లవ నరసింహవర్మ శాసనము
శాతవాహనులకు సామంతులుగానున్న పల్లవులు మొదట పల్నాడులో స్వతంత్రులై పిమ్మట ఉత్తర తమిళదేశములోని కంచిలో స్థిరపడ్డారు. తొలుత దొరికిన శాసనములు తమిళములో ఉన్నా, పిమ్మట పల్లవులు సంస్కృతమును, భారవి, దండి లాంటి సంస్కృత కవులను ఆదరించారు. శాసనాలు "పల్లవ గ్రంథం" అనబడు లిపిలో వ్రాయించారు. 8వ వరుసలో ఈలిపిని చూడవచ్చును. ఆధునిక తమిళ లిపి దీనినుండే పరిణామము చెందింది.

పరిణామము
భాషాపరంగా కన్నడ తమిళ భాషలు దక్షిణ ద్రావిడ కుటుంబానికి చెందినవి. కాని, చారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆంధ్ర కర్నాట దేశాలను పాలించడంవల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామము చెందింది. శాతవాహనుల కాలములోనే భట్టిప్రోలు లిపి కర్ణాట దేశానికి వ్యాప్తి చెందింది. ఆంధ్రదేశము, వేంగీ విషయము, కమ్మనాడు, పుంగనూరు వాస్తవ్యుడైన పంప అనే బ్రాహ్మణపండితుడు జైనమతావలంబియై వేములవాడను పాలించిన అరికేసరి అను చాళుక్య రాజు ఆశ్రయముపొంది విక్రమార్కవిజయము అనబడు తొలి కన్నడ గ్రంథము వ్రాశాడు. తెలుగు కన్నడ లిపులు ముడిపడి ఉండడానికి ఇలాంటి కారణాలు కొన్నిఉన్నాయి. వరుసలు 9, 10 మరియు 11 చాళుక్యుల కాలము (7, 10 మరియు 11వ శతాబ్దములు) నాటి లిపులను సూచిస్తునాయి. 10, 11 వరుసలలోని లిపిని వేంగీలిపి అనికూడ అంటారు. 12వ వరుసలో కాకతీయుల కాలమునాటి లిపిచూడవచ్చు. ఈ కాలములో తెలుగు భాష, సాహిత్యములు ప్రజ్వరిల్లాయి. 13, 14 వరుసలలో మహాకవి శ్రీనాథుని కాలము నాటి లిపి, చివరి వరుసలో విజయనగరకాలము నాటి తెలుగు-కన్నడ ఉమ్మడి లిపి చూడవచ్చు. అధునిక తెలుగు లిపికిది చివరి పరిణామదశ.

తెలుగు సాహితీ పద్దతులు

తెలుగుసాహిత్యములో ప్రపంచ సాహిత్యము లో వలెనే వివిధ రకరకాలైన పద్దతులు ఉన్నాయి. ముఖ్యముగా ఈ క్రింది విషయములు చెప్పుకొనవచ్చు.

1. జానపద సాహిత్యము
2. వచన కవితా సాహిత్యము
3. పద కవితా సాహిత్యము
4. పద్య కవితా సాహిత్యము
5. చంపూ సాహిత్యము
6. శతక సాహిత్యము
7. నవలా సాహిత్యము
8. చిన్న కథలు
9. అవధానములు
10. ఆశుకవిత
11. సినిమా సాహిత్యము

తెలుగు సాహితీ చరిత్ర - ముఖ్యమైన ఘట్టాలు

* స్త్రీల కోకిల కంఠములలో, కర్షక శ్రామికుల స్వేదంలో, జానపదుల సంతోషములలో, తెలుగువారి ఘనమైన పండుగలలో తెలుగు సాహితీ చరిత్ర మొదలయింది.
* తరువాత క్రీ.శ తొమ్మిదవ శతాబ్దం నుండి శిలా శాసనాల కు ఎక్కింది.
* క్రీ.శ పదకొండవ శతాబ్దములో ఆదికవి నన్నయ్య చేతిలో, ఆంధ్ర మహాభారతం రూపంలో ఆదికావ్య రచన మొదలయింది.
* ఈ ఆంధ్ర మహాభారతము ను పద్నాలుగవ శతాబ్దాంతానికి తిక్కన, ఎర్రన లు పూర్తి చేసారు. ఈ ముగ్గురూ తెలుగు కవిత్రయము అని పేరుపొందినారు.
* పదనేనవ శతాబ్దంలో గోన బుద్ధారెడ్డి రామాయణము ను తెలుగువారికి తెలుగులో అందించినాడు.
* పదునేనవ శతాబ్దంలో బమ్మెర పోతనామాత్యుడు భాగవతము ను తేట తెలుగులో రచించి, తెలుగువారిని ధన్యులను గావించాడు.
* పోతన కు సమకాలికుడైన శ్రీనాథ కవిసార్వభౌముడు తన ప్రబంధాలతో తెలుగుభాషకు ఎనలేని సేవ చేసాడు.
* పదహారవ శతాబ్దంలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయల పాలనా కాలంలో తెలుగు వైభవంగా వెలిగింది. తెలుగు పండితులను పోషించుటే కాక స్వయంగా తాను కూడా తెలుగులో రచనలు చేసిన సవ్యసాచి, రాయలు.
* పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలింది
* పదకవితా పితామహుడైన అన్నమయ్య తిరుపతి వేంకటేశ్వరునిపై రచించి, పాడిన ముప్పైరెండువేల పద్యాలు ఓ ప్రత్యేక సాహితీ భాండాగారం.
* క్షేత్రయ్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు వ్రాసిన కీర్తనలు నేటికీ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయి. త్యాగరాజ కీర్తనలు కర్ణాటక సంగీతానికి ఆయువుపట్టు వంటివి.
* తెలుగు భాషకు బ్రౌను చేసిన సేవలు బహు శ్లాఘనీయమైనవి. "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు" అంటారు.
* ఆధునిక యుగంలోని గురజాడ అప్పారావు, వాడుక భాషా ఉద్యమనేతలు, శ్రీశ్రీ, ఇంకా ఎందరో మహానుభావులు వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేసారు, చేస్తున్నారు.

దేశభాషలందు తెలుగు లెస్స

తెలుగు సాహిత్యం యుగ విభజన

తెలుగు సాహిత్యం కాలరేఖ

తెలుగు సాహిత్యము

నన్నయకు ముందు క్రీ.శ. 1000 వరకు
నన్నయ యుగము 1000 - 1100
శివకవి యుగము 1100 - 1225
తిక్కన యుగము 1225 - 1320
ఎఱ్ఱన యుగము 1320 – 1400
శ్రీనాధ యుగము 1400 - 1500
రాయల యుగము 1500 - 1600
దక్షిణాంధ్ర యుగము 1600 - 1775
క్షీణ యుగము 1775 - 1875
ఆధునిక యుగము 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత

తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాధా సప్తశతి లో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉన్నది.

క్రీ.శ. 1000 వరకు - నన్నయకు ముందు కాలం

ప్రధాన వ్యాసం: ప్రాఙ్నన్నయ యుగము

11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. (కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో నాగబు అనే పదం కనిపిస్తుంది.


1000 - 1100 : నన్నయ యుగము

ప్రధాన వ్యాసం: నన్నయ యుగము

దీనిని "పురాణ యుగము" లేదా "భాషాంతరీకరణ యుగము" అని అంటారు. నన్నయ్య ఆది కవి. ఈయన మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని, ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ,నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించిన వారే.


1100 - 1225 : శివకవి యుగము
నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది.


1225 - 1320 : తిక్కన యుగము
తిక్కన యుగము

1320 - 1400 : ఎఱ్ఱన యుగము

1400 - 1500 : శ్రీనాధ యుగము
తిక్కన(13వ శతాబ్ది), ఎర్రన(14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి. అందువలననే ఈ కాలాన్ని పురాణ యుగము అంటారు.


ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. ప్రబంధము అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధం, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కల్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.

ఈ సందర్భంలో రామాయణము కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం మనకు అందిన మొదటి రామాయణం.

ఈ కాలాన్నే "మధ్యయుగం" అని కూడా అంటారు.


1500-1600 : రాయల యుగము
దీనినే "ప్రబంధ యుగము" అని కూడా అంటారు. విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో ప్రబంధం అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.

1600 - 1775 : దక్షిణాంధ్ర యుగము
కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.

1775 - 1875 : క్షీణ యుగము


1875 తరువాత - ఆధునిక యుగము
1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్ వర్త్ వంటి ఆంగ్ల కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు భావకవిత్వం అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.

మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రము తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), గిడుగు రామ్మూర్తి , కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం, వ్యావహారిక భాషా వాదము నకు దారితీసింది.

తెలుగు భాష చరిత్ర

తెలుగు, భారత దేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజ భాష. "త్రిలింగ" పదము నుంచి "తెలుగు" పదం వెలువడిందని అంటారు. తేనె వంటిది కనుక "తెనుగు" అనాలని కొందరు అంటారు.

క్రీస్తు పూర్వం 200 నాటి శిధిలాలలొ తెలుగు భాష ఉండటంబట్టి ఈ భాష ప్రాచీనత మనకి తెలుస్తుంది

ఏమైనా తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది.


ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనకకు మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6 వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకం ఎ.డి. కి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.

ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదాహరింపబడినది:

పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి
ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం:

అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.

కాళ్ళకూరు నారాయణరావు తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము"లో ఈ యుగాన్ని క్రింది భాగాలుగా విభజించాడు.

* అజ్ఞాత యుగము:
క్రీ.పూ. 28 నుండి క్రీ.త. 500 వరకు:ఆంధ్రుల భాష గురించి కేవలం అక్కడక్కడా ఉన్న ప్రస్తావనల ద్వారా తెలుస్తున్న కాలం

* లబ్ధ సారస్వతము:
క్రీ.త. 500 నుండి 1000 వరకు.:శాసనాల వంటిని కొన్ని లభించిన కాలం

క్రీ.పూ. 28 ముందు

ఈ కాలంలో "ఆంధ్ర" అనే పదం మాత్రం కొద్ది ప్రస్తావనలలో ఉంటున్నది గాని "తెలుగు" అనే పదం ఎక్కడా లభించడంలేదు. అంతే కాకుండా ఆంధ్రుల జాతి గురించి ప్రస్తావించబడింది కాని భాష గురించి ఎలాంటి విషయం చెప్పబడలేదు. అయితే ఆంధ్రులు, తెలుగులు కలసిన ఫలితంగా ప్రస్తుత భాష రూపు దిద్దుకొన్నది గనుక "ఆంధ్ర దేశం" ప్రస్తావననే కొంత వరకు తెలుగు భాషకు చెందిన ప్రస్తావనగా భావిస్తున్నారు.

తెలుగు భాషకు తెలుగు, తెనుగు, ఆంధ్రము అనే మూడు పదాలున్నాయి. ఆంధ్రులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందు కృష్ణా గోదావరీ ప్రాంతం తెలుగు దేశమని పిలువబడేదని, ఆంధ్రుల పాలన తరువాత ఆంధ్ర దేశమయ్యిందనీ చరిత్రకారుల అభిప్రాయం. నన్నయభట్టు కాలం నాటికే తెలుగు, ఆంధ్రము అనే పేర్లు ఉన్నాయని నిదర్శనాలున్నాయి. తెలుగుభాష ద్రావిడ జన్యమా, లేక సంస్కృత ప్రాకృత జన్యమా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కాల్డ్‌వెల్ వంటివారి వాదన ప్రకారం తమిళ, మళయాళ, కన్నడ భాషలలాగా తెలుగు కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. క్రమంగా మిగిలినవానికి భిన్నంగా పరిణమించింది. చిలుకూరు నారాయణరావు వంటివారి అభిప్రాయం ప్రకారం తెలుగు భాష సంస్కృత ప్రాకృత జన్యం. ఏమైనా తెలుగు భాష తక్కిన (మాతృక) భాషలనుండి విడివడి ఏ దశలో పరిణమించిందో చెప్పడం సాధ్యం కావడంలేదు.

మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోనిదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివశిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు (ఆంధ్రాశ్చ బహవః) ఉన్నది. అయితే ఇది జాతికి చెందిన ప్రస్తావన మాత్రమే కనుక తెలుగు భాషకు సంబంధం లేకపోవచ్చును. నాగులు, ఆంధ్రులు, ద్రావిడులు, తెలుగులు, యక్షులు మరియు శబరులవంటి ఇతర వనవాస జాతులు కాలక్రమంలో వివిధ సంబంధాల ద్వారా, ప్రధానంగా భాషాపరంగా, కలసినందువలన ఆంధ్ర లేదా తెలుగు జాతి రూపుదిద్దుకొంది. మహాభారత యుద్ధానంతరం నెలకొన్న రాజకీయ కల్లోలం వలనా, మిడతల దండు కారణంగా ఏర్పడిన ఆహార లోపం వలనా క్రమంగా ఆంధ్రులు దక్షిణాపధానికి వలస వచ్చారు. యక్షులు భట్టిప్రోలు ప్రాంతంలో తూర్పు తీరాన ఉండేవారు. కళింగులు, తెలుగులు ఉత్తర తీరాంధ్రంలో వ్యవసాయం, ఇతర వృత్తులలో నిపుణులైన స్థిరనివాస జాతి. ద్రవిడులు రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు.

క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఉద్భవించిన బౌద్ధ, జైన మతాలకు ఆరంభ కాలంనుండి ఈ దక్షిణాపధంలో అనన్యమయన ఆదరణ లభించింది. అయితే పెద్దయెత్తున ఔత్తరాహులు ఆంధ్రాపధంపై దండెత్తిన ఆధారాలు లేవు. కొద్దిపాటి ఘర్షణలు జరిగి ఉండవచ్చును. క్రీ.పూ. 300 నాటికే బౌద్ధం, జైనం ఆంధ్రాపధంలో అమితంగా ఆదరణ పొందాయి. ఆంధ్రులు యుద్ధ నిపుణులైనా గాని దండెత్తి వచ్చినవారుకారు. బ్రతుకు తెరువుకోసం వచ్చినవారు. అయితే అప్పటికే స్థిరనివాసం ఏర్పరచుకొన్న తెలుగుల భాష మరింత పరిపక్వత చెందిఉండాలి. కనుక తెలుగు భాష ఈ జాతుల ఏకీకరణకు మార్గం మరింత సుగమం చేసింది. రాజకీయ అధికారం ఆంధ్రులు సాధించినా భాష మాత్రం తెలుగే నిలిచింది. ఈ నేపధ్యంలోనే ఆంధ్రజాతి, తెలుగు భాష రూపు దిద్దుకొన్నాయి. క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కధలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం) , ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన ఉన్నది. భట్టిప్రోలు శాసనం ద్వారా క్రీ.పూ. 400 నాటికి కుబ్బీరుడు (యక్షరాజు) తీరాంధ్రంలో రాజ్యం చేస్తున్నాడు.

పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయంలో - భాషనుబట్టి జాతికి పేరు రావడం చరిత్ర ధర్మం కాదు. జాతిని బట్టే భాషకు వారి భాషగా పేరు వస్తుంది. భాష, జాతి, సంస్కృతి అన్యోన్యాశ్రయములు. భాష పుట్టిన కొన్ని శతాబ్దాల తరువాత గాని ఆ భాషలో వాఙ్మయం పుట్టదు. ఇలా చూస్తే క్రీ.శ. 1000 ప్రాంతంలో పరిణత సాహిత్యం ఆవిష్కరింపబడిన తెలుగు భాష అంతకు పూర్వం ఎన్నో శతాబ్దాలనుండి వ్యవహారంలో ఉండి ఉండాలి.

క్రీ.పూ. 3వ శతాబ్ధిలోనిదైన బుద్ధఘోషుని వినయపిటకం వ్యాఖ్యలో "అంధక అట్టకధ" ఆంధ్ర భాషలోనిదైతే అప్పటికే ఆంధ్ర భాష తక్కిన భాషలనుండి వేరుగా గుర్తింపబడి ఉండాలని భావిస్తున్నారు. క్రీ. పూ. (రెండవ శతాబ్దం?) వాడైన భరతుడు నాట్య శాస్త్రంలో బర్బర కిరాత ఆంధ్ర జాతుల భాషలకు బదులు శౌరసేనినిని ఉపయోగించాలని వ్రాశాడు. పై కారణాల వలన "ఆంధ్ర భాష" లేదా "తెలుగు భాష" క్రీ.పూ. నాటికి ప్రత్యేకమైన భాషగా ఏర్పడి ఉండాలని ఊహించడానికి వీలవుతుంది కాని ఇదమిత్థంగా చెప్పడం సాధ్యం కావడం లేదు.

"తెలుగు భాష వయస్సెంత?" అనే వ్యాసంలో సురేష్ కొలిచాల క్రిందివిధంగా తెలుగు భాష ఎంత పాతదో నిర్ణయించే ప్రయత్నం చేశాడు

తమిళంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండీ సాహిత్యం లభిస్తోంది. తమిళం లోనూ కన్నడలోనూ తాలవ్యీకరణ (palatalization) లో వ్యత్యాసం కనబడుతోంది కాబట్టి, అవి రెండు కనీసం మూడు నాలుగు వందల యేండ్ల ముందుగా విడివడి ఉండాలి. ఆ రకంగా పూర్వ-తమిళం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు. కానీ దక్షిణ ద్రావిడ భాషలకూ, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలకూ శబ్ద నిర్మాణంలోనూ, వాక్య నిర్మాణంలోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. దక్షిణ ద్రావిడ భాషలైన తమిళ‌-కన్నడ లతో పోలిస్తే తెలుగు-కువి-గోండీ లలో కనిపించే వ్యత్యాసాలో కొన్ని--

1. వర్ణవ్యత్యయం (metathesis): తెలుగు-కువి-గోండి భాషలలో మూల ద్రావిడ ధాతువులోని అచ్చు తరువాతి హల్లు పరస్పరం స్థానం మార్చుకుంటాయి. (ఉదా: వాడు < *అవన్ఱు, వీడు <*ఇవన్ఱు, రోలు < ఒరళ్ <*ఉరళ్)
2. తెలుగులో బహువచన ప్రత్యయం- లు. తమిళాది దక్షిణ భాషల్లో ఇది -కళ్‌, -గళు.
3. క్త్వార్థక క్రియలు తమిళాదుల్లో -తు -ఇ చేరటం వల్ల ఏర్పడుతాయి. తెలుగు-కువి-గోండి భాషలలో -చి, -సి చేరటం వల్ల ఏర్పడుతాయి. ఉదా: వచ్చి, చేసి, తెచ్చి, నిలిచి వరుసగా తమిళంలో వన్దు , కెయ్దు, తన్దు, నిన్ఱు.

పైన పేర్కొన్న లక్షణాలన్నీ దక్షిణ మధ్య ద్రావిడ భాషలన్నిటిలో ఉండి దక్షిణ ద్రావిడ భాషలో లేనివి. అంటే ఈ మార్పులన్నీ తెలుగు-కువి-గోండి ఒకే భాషగా కలిసి ఉన్న రోజులలో మూల దక్షిణ ద్రావిడ భాషనుండి విడిపోయిన తరువాత వచ్చిన మార్పులన్న మాట. అన్ని ముఖ్యమైన మార్పులు రావటానికి కనీసం 400-500 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే తెలుగు-కువి-గోండి భాషలు దక్షిణ మధ్య ద్రావిడ ఉప శాఖగా క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో మూల దక్షిణ ద్రావిడం నుండి విడిపోవచ్చు. ఇదే నిజమైతే క్రీస్తు పూర్వం 700-600 వరకే తెలుగు ఒక ప్రత్యేక భాషగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రహ్మణం ఆంధ్ర జాతిని ప్రత్యేక జాతిగా పేర్కొనడం ఈ లెక్కతో సరిపోతుంది కూడా!

ఈ రకమైన కాలనిర్ణయం సాపేక్ష కాలమానాల (relative chronology) మీద ఆధారపడ్డదే కానీ పద, ధాతు వ్యాప్తి గణాంకాల (lexicostatistics) మీద ఆధారపడ్డది కాదు. ద్రావిడ భాషల పూర్వచరిత్ర పై ఇంకా పరిశోధనలు ఇతోధికంగా జరిగితే గాని తెలుగు భాషా జనన కాలనిర్ణయాన్ని నిష్కర్షగా చెప్పలేం.

క్రీ.పూ. 28 నుండి క్రీ.త. 500 వరకు (అజ్ఞాత యుగం)

క్రీ.పూ. 500 - క్రీ..త. 500 మధ్య కాలంలో జరిగిన జైన బౌద్ధ మతోన్నతులు, పతనాలు అప్పటి సాహిత్యంపై గాఢమైన ప్రభావం కలిగి ఉండాలని చరిత్ర కారుల అభిప్రాయం. ఈ కాలానికి సబంధించిన కొన్ని అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

* ఇప్పటికి తెలుగు భాష లిపి ప్రత్యేకంగా (బ్రాహ్మీ లిపినుండి వేరుగా) అభివృద్ధి అయిన తార్కాణాలు లేవు. "లిపికి ముందే సారస్వతము ఉండవచ్చును గాని అది కేవలం గ్రామ్య పదములో, వీరుల పాటలో, యక్షగానములో, మోహపుం గాసట బీసట యల్లికలో యై శృతి పరంపరాగతములై యుండును. లిపి మూలమున వాఙ్మయము విస్తారముగా వర్ధిల్లుటకు వీలున్నది. అందునను తెనుగున వాఙ్మయము లిపి నిర్మాణానంతరమే ఆరంభమై యుండును". కనుక ఈ కాలంలో తెలుగు సారస్వతం లేదనే భావించవచ్చును.

* శాతవాహనుల కాలంలో తెలుగు ప్రజా భాషయే గాని సారస్వత భాష కాదు, పండిత భాష కాదు. ఆనాటి రాజభాష ప్రాకృతము. పండిత భాష సంస్కృతము. కనుక తెలుగు సాహిత్యం అభివృద్ధి కావడానికి పెద్దగా ప్రోత్సాహం లభించకపోయి ఉండవచ్చును.

* బౌద్ధ జైన మతాలు విలసిల్లిన కాలలో ఎంతో కొంత సాహిత్యం లిఖితంగా కాని, మౌఖికంగా గాని ఉండి ఉండాలి. అయితే తరువాత విజృంభించిన శంకరవాదము, వీరశైనం కాలంలో మతోద్రేకాల కారణంగా బౌద్ధ జైన మత సంస్థల నాశనంతో పాటు ఎంతో సారస్వతం కూడా దగ్ధమైయుండవచ్చును. మతోద్రేకము ఎంతకైనా దారి తీయగలదు. కాకుంటే నన్నయ భారతం వంటి ఉద్గ్రంధం ఒక్కమారు ఆకసంనుండి ఊడిపడదు కదా? జైనపండితులు ఆ సమయంలో కన్నడ దేశానికి తరలిపోయి ఉండవచ్చును.

* ప్రాచీనాంధ్ర వాఙ్మయం లభించకున్నాగాని పూజ్యపాదుడు, పంపడు, మోళిగయ్య, నాగార్జునుడు, భీమకవి మొదలైన తెలుగువారు కన్నడ సాహిత్యానికి చేసిన సేవలను బట్టి చూస్తే తెలుగు భాషలో సాహిత్య పరంపర ఉండదనుకోవడం అసహజంగా కనిపిస్తుంది. ఆంధ్రులు కవులుగా నున్నయెడల ఆంధ్రమున కవిత్వము లేదనుట ఆశ్చర్యం. అయితే అప్పటిమత ఘర్షణలలో "విజయం" సాధించిన స్థానిక బ్రాహ్మణులకు సంస్కృతమే ఆదరణీయంగా ఉండేది గనుక తెలుగు లిఖిత సాహిత్యం పూర్తిగా నిరాదరణకు గురై ఉండవచ్చును.

క్రీ.పూ. 28

పూజ్యపాదుడనే కన్నడ(ఆంధ్ర)కవి కాణ్వ వ్యాకరణం గురించి ప్రస్తావించాడు. కాణ్వుడు క్రీ.పూ. 28వ సంవత్సరపువాడని, ఆంధ్రుడని పరిశోధకుల అభిప్రాయం. అప్పటికి జైనమే ప్రబలంగా ఉన్నందున ఆనాటి సాహిత్యం జైన సాహిత్యం కావచ్చునని, కనుక కాణ్వ వ్యాకరణం తెలుగు భాషకు సంబంధించినది కావలెనని కాళ్ళకూరు నారాయణరావు అభిప్రాయం. అందుకనే క్రీ.పూ.28 నుండి ఒక యుగంగా ఆ రచయిత పరిగణించాడు. అంటే కొన్ని రచనలు అప్పటికే తెలుగులో ఉండి ఉండాలని, తరువాత బ్రాహ్మణ మతదౌర్జన్యాల సమయంలో అవి నష్టమయ్యాయని అనుకోవచ్చును. వేగినాడు వీడిపోవుచున్న జైనులతోపాటు అప్పటికున్న తెలుగు సాహిత్యంకూడా ఆంధ్రావనిని వీడిపోయిందని ఆ రచయిత భావించాడు. పూర్వాంధ్రము "తెళుగు"గా మార్పులను చెందియుండవచ్చును.

క్రీ.శ. 1వ శతాబ్దం

క్రీ.శ. 1వ శతాబ్ధిలో గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో బృహత్కథ అనే పెద్ద కథా కావ్యం వ్రాశాడు. అందులో పైఠాన్ నగరంలో జరిగిన సంవాదంలో అతను సంస్కృత, ప్రాకృత, దేశ్య భాషలను పరిహరించినట్లు ఉన్నది. ఆ దేశ్య భాష ఏదో స్పష్టంగా తెలియడంలేదు కాని అప్పటికి ఆధునిక మహారాష్ట్ర భాష ఏర్పడలేదు. పైఠాన్ అప్పటి ఆంధ్ర సామ్రాజ్యానికి ఒక రాజధానిగా ఉండేది. కనుక ఆ దేశ్యభాష తెలుగు అనుకోవడానికి అవకాశం ఉంది.

క్రీ.శ. 1వ శతాబ్ధిలోనే హాలుడు గాధా సప్తశతి అనే ప్రాకృత కావ్యాన్ని సంకలనం చేశాడు. ఆ గాధలను రచించిన కొందరు ఆంధ్రులై యుండడంవల్లనేమో అందులో కొన్ని తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. - అత్తా, పాడి, పొట్ట, పిలుఆ (పిల్ల), కరణి, బోణ్డీ (పంది), మోడి, కులుఞ్చిఊణ వంటివి.

క్రీ.శ. 1వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు నిర్మాణం జరిగిన అమరావతీ స్తూపంలో ఒక రాతి పలక మీద నాగబు అనే తెలుగు పదం ("నాగంబు" రూపాంతరం) కనిపిస్తున్నది. అది ఒక వాక్యంలో భాగంగా కాక వేరుగా ఉంది. మనకు తెలిసినంతలో శాసనపరమైన మొదటి తెలుగు పదం ఇదే

క్రీ.శ. 200 - 500

శాతవాహనుల తరువాత ఏలిన ఇక్ష్వాకులు (210 - 300), బృహత్పలాయనులు (300 - 350), అనందగోత్రులు (290 - 620), శాలంకాయనులు, విష్ణుకుండినులు (400 - 600) , పల్లవులు (260 - 400 - 550) కాలానికి చెందిన శాసనాలు అన్నీ సంస్కృత, ప్రాకృత భాషలలోనే ఉన్నాయి. కాని వాటిలో తెలుగు భాషలోనివి అనిపించే పేర్లు, పదాలు, ప్రత్యయాలు కనిపిస్తున్నాయి - ఊరు, పర(పఱ్ఱ), కొన్ఱ (కొండ), చెరువు, వంటి పదాలతో ముగిసేవి - ఉదాహరణకు వ్యక్తుల పేర్లు - గోలశర్మ, కొట్టిశర్మ, దొడ్డి స్వామి; గ్రామాల పేర్లు - కురువాడ, చిన్నపురి, చెఞ్చెరువు, తెల్లవల్లి, పెరువాటము వంటివి. దీనినిబట్టి ఆ కాలానికే ఈ ధ్వనులు ఉన్న ద్రావిడ భాష (తెలుగు అనుకొందాము) వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది.

కాళ్ళకూరు నారాయణరావు అభిప్రాయంలో పూర్వాంధ్రభాష (తెళుగు) లక్షణాలు ఇవి కావచ్చును -

1. ఆర్యావర్తంలో సామ్రాజ్యం స్థాపించి సప్తశతివంటి ప్రాకృత గ్రంధాలు వ్రాసిన "కర్ల తెల్లంగు" రాజుల మాతృభాష కనుక శుద్ధ సంస్కృతంకంటే ప్రాకృత పదాలే ఎక్కువగా ఉండవచ్చును.
2. అప్పటికి బౌద్ధ జైన ప్రాబల్యమే తెలుగు సీమలో అధికం గనుక సారస్వతం కూడా వారిదే అయిఉండవచ్చును.
3. అటువంటి పూర్వాంధ్రం నేటి ఆంధ్రంగా మారేసరికి 14,814 తత్సమ శబ్దాలు చేరాయి. ఉన్న 12,337 దేశ్య పదాలలో తద్భవాలు 2,000. తురక ఇంగ్లీషు పదాలు 1,500. రూపములు మారి వికృతి చెందిన దేశ్యములే అనిపించేవి దాదాపు 4,000. కనుక శుద్ధ దేశ్యపదాలు 4,000 - 5,000 మధ్య ఉండవచ్చును. ఈ నాలుగు వేల పదాలు లోక వ్యవహారానికి చాలు.

క్రీ.త. 500 నుండి 1000 వరకు (శాసనాధారాలు)

సింధు లోయ నాగరికత లిపి ఇంతవరకు సరిగా చదువబడలేదు. వేదసూత్ర వాఙ్మయం కేవలం మౌఖికమో, లేక అక్షర బద్ధం కూడా అయిందో తెలియరావడంలేదు. కనుక అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది. అందులోనుండే తెలుగు అక్షరాలు రూపొందినాయనిపిస్తుంది. కుబ్బీరకుని భట్టిప్రోలు శాసనము, అశొకుని ఎఱ్ఱగుడిపాడు (జొన్నగిరి) గుట్టమీది శాసనము ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు. వాటిలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీలిపి.

తరువాత అమరావతిలోని నాగబు అనే పదము (క్రీ.శ. 1వ శతాబ్ది) , విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (క్రీ.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు. నాగార్జునకొండ వ్రాతలలో కూడ తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాకృత శాసనాలు లేదా సంస్కృత శాసనాలు. కనుక తెనుగు అప్పటికి జనసామాన్యంలో ధారాళమైన భాషగా ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ఆరవ శతాబ్ది తరువాత బ్రాహ్మీలిపినే కొద్ది మార్పులతో తెలుగువారు, కన్నడంవారు వాడుకొన్నారు. అందుచేత దీనిని "తెలుగు-కన్నడ లిపి" అని పరిశోధకులు అంటారు.


6,7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపధ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో రేనాటి చోడులు సప్తసహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్యఘట్టం. వారి శాసనాలు చాలావరకు తెలుగులో ఉన్నాయి. వాటిలో ధనంజయుని కలమళ్ళ శాసనం (కడప జిల్లా కమలాపురం తాలూకా) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది క్రీ.శ. 575 కాలందని అంచనా. అంతకుముందు శాసనాలలో చెదురు మదురుగా తెలుగు పదాలున్నాయి గాని సంపూర్ణమైన వాక్యాలు లేవు.


ఆ తరువాత జయసింహవల్లభుని విప్పర్ల శాసనము క్రీ.శ. 641 సంవత్సరానికి చెందినది. 7,8, శతాబ్దులలోని శాసనాలలో ప్రాకృత భాషా సంపర్కము, అరువాతి కాలంలో సంస్కృత భాషా ప్రభావం అధికంగా కానవస్తాయి. 848 నాటి పండరంగుని అద్దంకి శాసనములో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లుని బెజనాడ శాసనములో ఐదు సీస పద్యాలున్నాయి. 1000 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు వ్రాయబడ్డాయి. వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంధాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.

ప్రతి తెలుగు వాడు చదువ వలసినవి

• ఆంధ్ర మహాభారతము
• కుమార సంభవము
• ఆంధ్ర మహాభాగవతము
• మనుచరిత్ర
• వసుచరిత్ర
• కళాపూర్ణోదయము
• సుమతీ శతకము
• వేమన శతకము
• కాశీయాత్రా చరిత్ర
• కన్యాశుల్కం
• రామాయణ కల్పవృక్షము
• మహా ప్రస్థానం
• అమరావతి కథలు
• పాండవోద్యోగ విజయములు

సాహితీ మూర్తులు

.నన్నయ
• తిక్కన
• ఎఱ్ఱన
• శ్రీనాధుడు
• పోతన
• కృష్ణదేవరాయలు
• పెద్దన
• వేమన
• మొల్ల
• రంగాజమ్మ
• అన్నమయ్య
• త్యాగయ్య
• రామదాసు
• బ్రౌన్
• కొమర్రాజు వేంకట లక్ష్మణరావు
• గురజాడ
• గిడుగు రామమూర్తి
• కాశీనాధుని నాగేశ్వరరావు
• రాయప్రోలు
• వీరేశలింగం
• చిలకమర్తి
• తిరుపతి వెంకట కవులు
• విశ్వనాథ
• కృష్ణశాస్త్రి
• శ్రీశ్రీ
• చలం
• జాషువా.....

పైన పేర్కొన్న వారి గూర్చి పూర్తి విషయాలు త్వరలొ వెల్లడిస్తాను

"తెలుగు అక్షరాలు"

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః

క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ క్ష ళ ఱ

వర్షం లేదా వాన

వర్షం లేదా వాన ఆకాశంలోని మేఘాల నుండి భూతలం పైకి నీటి బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన అవపాతం. ఆకాశం నుండి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని విర్గా అంటారు. ఈ ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా, వాతావరణం పొడిగా ఉండే ఎడారి ప్రాంతాలలో కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది మరియు ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను బెర్గెరాన్ ప్రక్రియ అంటారు.

జలచక్రములో వర్షం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సముద్రాల నుండి నీరు ఆవిరై, ఆ తేమ తిరిగి ఆకాశములో ధ్రవీభవించి బుడగలలాగా ఏర్పడిన అవపాతము ఆకాశానికి తేలుతుంది. ఆ అవపాతము వర్షముగా కురుస్తుంది. వర్షము పడిన అవపాతాన్ని తిరిగి సముద్రానికి చేర్చి నదులు ఈ చక్రాన్ని పూర్తి చేస్తాయి. మొక్కలు పీల్చుకున్న నీటిని శ్వాస క్రియలో ఆవిరిగా వాతావరణంలోకి వదులుతాయి. అలా వదిలిన ఆవిరి ఇతర నీటి అణువులను చేరి నీటి బిందువులుగా యేర్పడతాయి. సాధారంగా వర్షాన్ని అవపాత పరిమాణం మరియు అవపాతానికి కారణం అన్న రెండు అంశాలతో వర్గీకరిస్తారు.

అవపాతం, అందునా వర్షం వ్యవసాయన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అన్ని మొక్కలకూ జీవించటానికి కొంతైనా నీరు అవసరం. వర్షం అత్యంత సులువైన నీరు అందజేయు పద్ధతి కాబట్టి, ఇది వ్యవసాయానికి చాల ఉపయోగకరమైనది. సాధారణంగా ఒక క్రమ పద్ధతిలో తరచూ పడే వర్షాలు మొక్కలు ఆరోగ్యముగా పెరగటానికి అవసరం కానీ అతివృష్టి, అనావృష్టి రెండూ పంటలకు ముప్పును కలుగజేస్తాయి. అన్ని దేశాలలో వ్యవసాయం ఎంతోకొంత వరకైనా వర్షంపై ఆధారపడుతుంది. భారతీయ వ్యవసాయ రంగము వర్షంపై భారీగా ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా పత్తి, వరి, నూనెదినుసులు మరియు ముతక ధాన్యం పంటలు అతి ఎక్కువగా వర్షంపై ఆధారపడుతున్నవి. ఋతుపవనాలు కొన్ని రోజులు ఆలస్యమైనా, అది దేశ ఆర్ధికరంగాన్ని విపరీతంగా దెబ్బతీస్తుంది.

కాటమరాజు కథ - ఆరుద్ర నాటకం

కాటమరాజు కథ - 13 వ శతాబ్దం చివరిలో నెల్లూరుసీమలో జరిగిన ఒక వాస్తవ వీరగాథ. పలనాటి వీరచరిత్ర లాగా కాటమరాజు కథ కూడా మన రాష్ట్రంలో సుప్రసిద్ధం.

కాటమరాజు గొల్లప్రభువు. వేలాది పశువులు అతడి ఆస్తి. శ్రీశైలం ప్రాంతంలో తమ ఆవులను మేపుతూంటారు. ఓ సంవత్సరం ఆ ప్రాంతంలో కరవు కారణంగా గ్రాసం లేక వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దక్షిణంగా ప్రయాణించి పాకనాడుకు చేరి అక్కడి పాలకుడు నల్లసిద్ధిరాజుతో ఒక ఒడంబడికకు వచ్చి ఆ రాజ్యంలో పశువులను మేపుకుంటూంటారు. ఒక సంవత్సరం పాటు పశువులను మేపుకోనిస్తే ఆ ఏడాదిపాటూ పుట్టే కోడెదూడలన్నిటినీ నల్లసిద్ధికి అప్పగించాలి. ప్రతిగా నల్లసిద్ధి వారికి తమ రాజ్యంలో రక్షణ కల్పిస్తాడు. ఇదీ కౌలు ఒడంబడిక. అయితే, నల్లసిద్ధి ఉంపుడుకత్తె కారణంగా నల్లసిద్ధికీ కాటమకూ తగవు వస్తుంది. అది యుద్ధానికి దారితీస్తుంది.

స్థూలంగా ఇదీ కథ. ఈ కథను ఆరుద్ర నాటకంగా రాసారు. లభించిన చారిత్రిక ఆధారాల నేపథ్యంలోనే నాటకాన్ని రాసారు. యుద్ధఫలితం ఏమైందనే విషయమై చరిత్రలో సరైన వివరం లేనందువల్లనో ఏమో.. నాటకం యుద్ధఫలితాన్ని సూచించకుండా ముగుస్తుంది. యుద్ధంలో కాటమరాజు మరణించి ఉండవచ్చని పుస్తకానికి పీఠిక రాసిన పరిశోధకుడు రాసారు. ఈ యుద్ధంలోనే, ఖడ్గతిక్కన పాల్గొని మరణించింది. కవి తిక్కన (తిక్కన సోమయాజి) ఖడ్గ తిక్కనకు పినతండ్రి కొడుకు.

ఆరుద్ర ఈ నాటకాన్ని 1961 లో రచించారు. ఏ సందర్భంలో ఎవరి ప్రోద్బలంతో రాసారో 'రచన గురించి 'లో కె.రామలక్ష్మి చెప్పారు. ఈ నాటకాన్ని మొదట ఎక్కడాడారో, ఎవరెవరు నటించారో కూడా తొలి పేజీల్లో ఇచ్చారు. ఆ నాటకం చదివాక నాకు కలిగిన అనుభూతి ఇది.

నాటకం చదవడానికి హాయిగా ఉంది. నేను ఏకబిగిని చదివేసాను. నాటకం ముక్కుసూటిగా సాగిపోతుంది. కథ వేగంగా నడుస్తుంది. అనవసరమైన సాగతీత లేదు. అనవసరమైన సన్నివేశాలు లేవు, సంభాషణలూ లేవు. ఒక సన్నివేశం.. నల్లసిద్ధి కాటమరాజుకు రాయించిన కౌలుపత్రం నల్లసిద్ధికి అతడి దూత వినిపిస్తూండగా ముగుస్తుంది. వెంటనే వచ్చే సన్నివేశంలో కౌలుపత్రంలోని మిగతా భాగాన్ని అదే వ్యక్తి కాటమరాజుకు వినిపిస్తూండగా మొదలౌతుంది. సినిమాలో సీను మారినట్టుగా అనిపిస్తుంది. -సినిమావేత్త రాసిన నాటకం మరి!

చారిత్రిక కథల్లో సహజంగా ఉండే అతిశయోక్తులు ఈ నాటకంలో చాలా తక్కువగా ఉన్నాయి. నాకు అగుపడ్డ ఒక అతిశయోక్తి కాటమరాజు వద్ద ఉన్న పశువుల సంఖ్య. అది పదిలక్షలని కాటమరాజు దూత ఖడ్గతిక్కనకు చెబుతాడు. పది లక్షలంటే చాలా ఎక్కువగా అనిపించడం లేదూ!!

సంభాషణల్లో ఓ చమక్కు - సిరిగిరి అనే పాత్ర తన భర్తతో సరస సంభాషణలు చేస్తూండగా మాటల్లో భర్త, 'నేను శ్రీశైలం వెళ్ళిపోతాను' అని అంటాడు. సిరిగిరి అయ్యో నన్నొదిలి వెళ్ళిపోతావా అని కలత చెందుతుంది. ఓసి పిచ్చిదానా 'శ్రీ శైలం' అన్నా, 'సిరి గిరి' అన్నా ఒకటే గదా.. నేను నిన్ను చేరుకుంటాననే గదా చెబుతున్నది అని చమత్కరిస్తాడు.

రచయిత కాటమరాజు పట్ల, అతని పక్షం పట్లా ఒకింత పక్షపాతం చూపించాడని అనిపిస్తుంది. కాటమరాజును శ్రీరామచంద్ర సముడిగా చూపిస్తాడు. రాముడితో పాటు, భరతుడు, కైక పాత్రలు కూడా కనిపిస్తాయి. ఆవులను తోలుకొని దక్షిణాదికి పొమ్మని కాటమరాజుకు సిరిదేవి (కైక) చెప్పడం, అందుకు కోపించి అమె కన్నకొడుకు అయితంరాజే (భరతుడు) ఆమెపై కత్తియెత్తడం, ఖండఖండాలుగా నరికేస్తాననడం.. అంతా మరీ నాటకీయంగా ఉంది. అలాగే, యుద్ధానికి దారితీసిన కారణాల్లో నల్లసిద్ధితో పాటు కాటమరాజుది కూడా తప్పు ఉండి ఉండవచ్చు అని నాకు అనిపించింది. చరిత్రలో కూడా ఒక పక్షం వైపు పూర్తిగా మంచే ఉండి, ఎదరి పక్షం పూర్తిగా విలనీని ప్రదర్శించిందా అనేది సందేహాస్పదమే! అయితే ఇది శాస్త్రీయంగా రాసిన చరిత్ర పుస్తకం కాదు, కేవలం చరిత్ర ఆధారంగా రాసిన నాటకం. కాబట్టి, కొంత నాటకీయత సహజం, అవసరం కూడానేమో!

కాటమరాజు పాత్ర అచ్చు బొబ్బిలియుద్ధం సినిమాలో రంగారాయుడి పాత్ర (రామారావు వేసాడు) లాగానే అనిపించింది. ఆ సినిమాలో లాగానే ఈ నాటకంలో కూడా అనుచరులు చీటికీ మాటికీ కత్తులు దూస్తూ ఉంటారు. కాటమరాజు శాంతి వచనాలు చెబుతూ వాళ్ళను చల్లబరుస్తూ ఉంటాడు. ఇక, మనకు బాగా పరిచయమైన ఖడ్గతిక్కన పాత్ర మీద రచయిత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు అనిపించింది. యుద్ధభూమి నుండి వెనుదిరిగి వచ్చినపుడు భార్యా తల్లీ అతడికి చేసిన 'సన్మానం' ఇందులోనూ ఉంది. కానీ అతడెందుకు వెనుదిరిగి రావాల్సి వచ్చిందో కారణం చూపించాడు ఆరుద్ర. నాకు నచ్చిందది. ఖడ్గ తిక్కనకు సంబంధించి ఉద్వేగభరితమైన మరో సన్నివేశాన్ని సృష్టించి సెంటిమెంటును కూడా పండించాడు రచయిత.

కాటమరాజుతో పోరాడిన రాజు మనుమసిద్ధి అని మనం చదూకున్నాం. ఈ నాటకంలో మాత్రం నల్లసిద్ధిరాజు అనే పేరు ఉంది. నల్లసిద్ధి, మనుమసిద్ధి ఒక్కరేనా? ఈ సందేహాన్ని తీరుస్తూ, పీఠిక రాసిన తంగిరాల వేంకట సుబ్బారావు గారు ఈ ఇద్దరూ వేరువేరని తేల్చిచెప్పారు. కాబట్టి ఆ రాజు నల్లసిద్ధి అని స్థిరపరచుకుందాం. కానీ, నాటకమంతా నల్లసిద్ధి అనే వాడారు గానీ.., పుస్తకంలో మొదట్లో ఇచ్చిన 'నటీనటులు' అనే పేజీలో రాజు పేరును మనుమసిద్ధి అని రాసారు. నాటకంలో కూడా ఒక పద్యంలో 'మనుమసిద్ధి' అనే పేరు వస్తుంది. చదువరులకు ఇది అయోమయం కలిగిస్తుంది.

నాటకానికి ముందే పాత్రల పరిచయపట్టిక ఉంటే బాగుండేది. పాత్రలు చదువరికి ముందే పరిచయమైపోవాలి. లేకపోతే కొంత అయోమయంగా అనిపిస్తుంది. మొదటి రంగంలో ఓ రెండు పేజీలు కాగానే ఒక్కసారిగా నాలుగైదు పాత్రలు ప్రవేశిస్తాయి. వాటిలో ఒకపాత్ర పేరు 'అగుమంచి ' -ఎప్పుడూ వినని పేరు! అంతకుముందు 'ఆడంగులొస్తున్నారు' అనే సూచన ఉంది కాబట్టి ఆ పాత్ర ఆడమనిషి అని అనుకుంటాం, లేకపోతే ఆ పాత్ర ఆడో మగో కూడా తెలీదు. ఆ తరవాత తెలుస్తుందనుకోండి. పీఠిక రాసిన తంగిరాల వారు కథను, అందులోని పాత్రలను పరిచయం చేసారు. అయితే పరిచయంలో కాటమరాజు వంశవృక్షం మొత్తాన్నీ చెప్పడంతో అది కొంచెం పెద్దదైపోయింది. నాటకం చదవబోయేముందు వివిధ పాత్రల గురించి తెలుసుకోవడం కోసం పీఠిక చదవడం తప్పనిసరి.

నాటకం కాబట్టి ప్రతి సంభాషణకూ ముందు పాత్ర పేరు రాస్తారు కదా.. 'అయితంరాజు' అనే పాత్ర చెప్పే మొట్టమొదటి సంభాషణకు ముందు "అయి" అని రాసారు. ముందే పాత్రల పరిచయంలేదు..., కనీసం పాత్రను పరిచయం చేసే సన్నివేశంలోనైనా పూర్తిపేరు వెయ్యొద్దా? 'అయి' అంటే ఏం అర్థమౌతుంది? అంతకు ముందు వేరే పాత్రలు ఈ పాత్ర గురించి మాట్టాడుకుంటాయి కాబట్టి కొంత అర్థమౌతుంది.

నాటకం చూస్తే కలిగే అనుభూతి బహుశా నాటకాన్ని చదివితే కలగదు. పాత్రల ఆహార్యాన్నీ, హావభావాల్నీ ఊహించుకుంటేగానీ మనం నాటకాన్ని ఆస్వాదించలేం. ఈ నాటకాన్నే ఒక నవలగా చదివితే బహుశా నాకు మరింత తృప్తిగా ఉండేదేమో! నవలలోనైతే సంభాషణలే కాక, పాత్రల మానసిక పరిస్థితి, మనోభావాల వర్ణన కూడా ఉంటాయి కాబట్టి, రచన మరింత సమగ్రంగా ఉంటుంది. సన్నివేశానికి ముందు ఆ సన్నివేశం గురించిన వర్ణన, వివరణ మరింత విపులంగా ఉండాలేమో ననిపించింది.
పద్యాలు ఇష్టపడేవాళ్ళకి, ఈ నాటకం మరింతగా నచ్చుతుంది. చక్కటి పద్యాలను ఇందులో సందర్భోచితంగా ఇమిడ్చారు. ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న చాటువులను సేకరించారు. కొన్ని రచయిత తానే రాసారట. పద్యాలు పెద్ద పెద్ద సమాసాలతో కాకుండా తేలిక పదాలతో సులభంగా అర్థమౌతూ ఉంటాయి. చక్కగా పాడుకోను వీలుగా ఉంటాయి. మచ్చుకో పద్యం చూడండి.

సీస||

మురదండ మేఘముల్ ముసిరి వచ్చుటలేదు
ముంతపోతగా వాన ముంచలేదు
దడదడ చప్పుళ్ళ దబ్బాటు వానలా?
గొర్తి పదునుదాక కురియలేదు
వర్షించు వేళలో వాగళ్ళు కనిపించి
సింగిణి రంగులుప్పొంగలేదు
ఎల్లంకి గాలులు ఏనాటి ముచ్చటో
పీచరగాలైన వీచలేదు


తే.గీ||
కన్నెపిల్లలు కావిడికట్టె త్రిప్ప
కప్పతల్లియు నోరెండి కన్నుమూసె
వరుణదేవుని గుండెలు కరుగలేదు
చేటు కాలము ప్రాప్తించె కాటభూప

తేటగీతిలోని చివరి పాదాన్ని చూడకపోతే, ఈ పద్యాలు నేటి ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితిని వర్ణిస్తూ రాసినవేమోననుకుంటాం.

నాటకంలో 'ఠాణా' అనే పదాన్ని వాడారు. హిందీ మాటను వాడారేంటబ్బా అనుకున్నాను -బహుశా సంస్కృతపదమయ్యుండొచ్చు. 'లంచం ' ఆ రోజుల్లోనే ఉండేదని కూడా అర్థమైంది.

పుస్తకం రాసినవారి ప్రజ్ఞ గురించి నేను చెప్పగలిగినదేమీ లేదు. కానీ, వేసినవారి గురించి మాత్రం రెండు ముక్కలు చెప్పాలి. బాపుబొమ్మ అట్టతో, పెద్ద అక్షరాలతో పుస్తకాన్ని ముద్రించారు. నాటకం మొత్తానికి ఒక ఖతి (ఫాంటు), పద్యాల కోసం ప్రత్యేకంగా వేరే ఖతినీ వాడారు. ఆ పద్ధతి బాగుంది. అయితే ఒక్క పద్యానికి మాత్రం మామూలు ఖతే పడింది, ఎందుకో తెలవదు. కొన్ని పద్యాల పాద విభజన సరిగ్గా లేదు. కంపోజింగు అయ్యాక, సరిచూడవలసినవాళ్ళు సరిగ్గా చూడలేదన్నది స్పష్టం. 'ఛందస్సు సరిపోవడంలేదేమిటా'ని కూడా చూసుకోలేదు. పద్యాల్లో అచ్చుతప్పులూ దొర్లాయి. ఇతరచోట్ల కూడా అచ్చుతప్పులున్నాయి.పద్యాల కోసం వాడిన ఫాంటులో 'ళ' అక్షరం సరిగ్గా లేదు, అది అచ్చం 'శ'లాగా కనిపించింది. (బొమ్మలో చూడండి) నాకు చాలా అసంతృప్తి కలిగించిన అంశమది. ఖతిలో ఆ దోషం ఉన్నపుడు వేరే ఖతి వాడి ఉండాల్సింది. ఏదో ఒకటి అచ్చేసి ప్రజల్లోకి తోసేద్దామనుకుంటే జరిగేది అచ్చుతప్పులూ అచ్చ తప్పులేకాదు, రచయితకు అపచారం కూడా.

కథకు సంబంధించి ఆకరాలను (రిఫరెన్సులు), మూలాలను కూడా ఇచ్చి ఉంటే పుస్తకానికి మరింత విలువ రావడమే కాదు, ఈ కథ గురించి మరింత తెలుసుకునేందుకు చదువరులకు అవకాశం ఉండేది. కథ జరిగిన ప్రదేశాలను సూచిస్తూ ఒక మ్యాపును పుస్తకంలో ఇచ్చి ఉంటే కూడా బాగుండేది.

చాలా తెలుగు పుస్తకాలకు ఉండే ప్రత్యేకతలు దీనికీ ఉన్నాయి. అవి:

* మూడో పేజీలోనో నాలుగో పేజీలోనో పుస్తకం గురించి వేస్తారు చూడండి.. పుస్తకం పేరు, ముద్రించినది ఎక్కడ, ప్రచురించినది ఎవరు, ఏ సంవత్సరంలో వేసారు, ఎన్నో ఎడిషను, ప్రతులు ఎక్కడ దొరుకుతాయి వగైరా సమాచారం మొత్తం, అన్ని పుస్తకాల్లోలాగే ఇంగ్లీషులోనే ఉంది. దీన్ని ఇంగ్లీషులో వెయ్యాల్సిన అవసరం ఏంటో? మన సినిమాల్లో పేర్లన్నిటినీ తెలుగులో వేసేసి, నిర్మాత దర్శకుల పేర్లు మాత్రం ఇంగ్లీషులో కూడా వేసుకున్నట్టు, మన పాటల కాసెట్ల మీద పాటకు సంబంధించిన క్రెడిట్లన్నీ ఇంగ్లీషులో ఉన్నట్టు!
* ISBN లేదు.